Site icon HashtagU Telugu

IPL 2022: మిచెల్ మార్ష్ కు రీప్లేస్ మెంట్ ఎవరు ?

78

78

ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. ఇటీవలే ముగిసిన మెగా వేలంలో మిచెల్ మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 6.5 కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేసింది.

మిచెల్ మార్ష్ లాంటి స్టార్ ఆటగాడు లీగ్ మొత్తానికి దూరమైతే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిచెల్ మార్ష్‌ దూరమైతే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అతని స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోయిసెస్ హెన్రిక్స్ గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. మైదానంలో హెన్రిక్స్ అటు బ్యాట్‌తో పాటు ఇటు బంతితో కూడా రాణించగల సమర్థుడు.

ఐపీఎల్‌లో ఇంతకుముందు హెన్రిక్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల తరఫున బరిలోకి దిగాడు… ఈ క్రమంలో మిచెల్ మార్ష్‌ స్థానంలో హెన్రిక్స్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఆస్ట్రేలియా ఆటగాడు మెక్‌డెర్మోట్‌ టీ20 స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. గత కొంత కాలంగా బిగ్‌బాష్‌ లీగ్ లో మెక్‌డెర్మోట్‌ అద్భుతంగా రాణించాడు. కానీ ఐపీఎల్‌-2022 వేలంలో అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలో మిచెల్ మార్ష్‌ స్థానంలో ఢిల్లీ మెక్‌డెర్మోట్‌ని తీసుకునే అవకాశం ఉంది. అలాగే శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కూడా గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు.. ఈ క్రమంలో మిచెల్ మార్ష్‌ స్థానంలో దసున్ షనకను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకునే ఛాన్స్ ఉంది.

Exit mobile version