Who Is Himanshu Singh: సెప్టెంబర్ 19 నుంచి చెన్నై చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. చాలా గ్యాప్ తర్వాత కోహ్లీ, పంత్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా భావించి ఓ యంగ్ బౌలర్ ని బరిలోకి దించుతుంది. సెప్టెంబరు 13 నుండి 18 వరకు చెన్నైలో ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతాయి. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ ల కోసం బీసీసీఐ హిమాన్షు సింగ్ ను రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ హిమాన్షు సింగ్ ఎవరు? అతని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.
టీమిండియా సన్నద్ధత కోసం బీసీసీఐ ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్(Himanshu Singh)ను పిలిచింది. అతను రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీతో సహా అందరికీ బౌలింగ్ చేయనున్నాడు. ఇటీవలి పలు ప్రాక్టీస్ మ్యాచ్ లలో తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లను ఆశ్చర్యపరిచిన హిమాన్షు సింగ్ కి బీసీసీఐ మరో అవకాశం ఇచ్చింది. 21 ఏళ్ల హిమాన్షు ఆఫ్ స్పిన్నర్ బౌలర్. తన బౌలింగ్ యాక్షన్ చూస్తే రవిచంద్రన్ అశ్విన్(Ashwin) గుర్తుకు వస్తాడు. ఈ ముంబై బౌలర్ ఇటీవల దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. అతను కొంతకాలంగా బీసీసీఐ ఎమర్జింగ్ ప్లేయర్స్ క్యాంపులో భాగంగా ఉన్నాడు. హిమాన్షు ఆఫ్ స్పిన్‌కి ఫిదా అయిన టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియాలో హిమాన్షు సింగ్ అడుగుపెడితే ఎదో ఒకరోజు తన ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తాడని చెప్పుకొచ్చాడు.
6 అడుగుల 4 అంగుళాల ఎత్తున ఈ కుర్రాడు బౌలింగ్ యాక్షన్ చూసి అజిత్ అగార్కర్ మురిసిపోయాడు. కేటీ మెమోరియల్ టోర్నమెంట్‌లో హిమాన్షు ఆంధ్రప్రదేశ్‌పై 74 పరుగులకు 7 వికెట్లు పడగొట్టాడు. దీనికి ముందు 2023-24 సీజన్‌లో అండర్-23 సీకే నాయుడు ట్రోఫీలో 8 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు తీశాడు. అంతేకాదు ఒక ఇన్నింగ్స్‌లో 4 సార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలోనే భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ శిబిరంలో హిమాన్షు సింగ్ కి అవకాశం కల్పించారు. కాగా భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో తొలి మ్యాచ్ జరగనుంది. కాగా రెండో మ్యాచ్ కాన్పూర్‌లో జరగనుంది. తొలి టెస్టుకు భారత జట్టును ప్రకటించారు.
Also Read: IND vs BAN Live Updates: కేఎల్ రాహుల్ వర్సెస్ సర్ఫరాజ్ ఖాన్