Site icon HashtagU Telugu

IPL Couches: కోచ్‌లుగా మారుతున్న 2011 ప్రపంచకప్ హీరోలు

2011 World Cup

2011 World Cup

IPL Couches: 2011 అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ ఏడాది జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకను ఓడించి భారత జట్టు వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది జరిగి 13 ఏళ్ళు అవుతుంది. కానీ ఆ జట్టులోని సభ్యులు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఈ జనరేషన్ క్రికెట్ ఫ్యాన్స్ కు వాళ్లే మన హీరోలు. న్యూ ప్లేయర్స్ వస్తున్నప్పటికీ సచిన్, సెహ్వాగ్, ధోనీ, యువరాజ్ ఇలా మన సీనియర్ ప్లేయర్ల పేరు చెప్తుంటేనే గూస్బంప్స్ వస్తుంటాయి. అయితే టీమ్ ఇండియాను చాంపియన్‌గా నిలబెట్టిన చాలా మంది ఆటగాళ్లు రిటైరయ్యారు. కోహ్లీ మినహా ఆల్మోస్ట్ అందరూ రిటైర్ అయ్యారు. అయితే వారిలో చాలా మంది కోచింగ్ రంగంలోకి ప్రవేశించారు. ఇందులో గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి.

గౌతమ్ గంభీర్ 2024లోకోల్కతా నైట్ రైడర్స్ ని ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతకుముందు లక్నోకి మెంటర్ గా సేవలనందించాడు. గంభీర్ హయాంలో లక్నో ప్లే ఆఫ్ కి చేరింది. అయితే కప్ కొట్టలేకపోయింది. దాంతర్వాత గౌతీ టీమిండియాకు హెడ్ కోచ్ గా ప్రమోట్ అయ్యాడు. అదే సమయంలో ఆశిష్ నెహ్రా కూడా గుజరాత్ టైటాన్స్‌ ని ఛాంపియన్ గా నిలబెట్టాడు. 2022 ఎడిషన్లో గుజరాత్ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. నెహ్రా కోచింగ్, హార్దిక్ కెప్టెన్సీ, ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో అరంగట్రంలో జిటి టైటిల్ గెలుచుకుంది. వీళ్ళతో పాటు వన్డే ప్రపంచకప్ ఆడిన మిగతా ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో కోచ్ గా, మెంటర్ గా బాధ్యతలు చేపట్టారు.

టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి ఆడాడు. 2013లో ఆటగాడిగా రిటైరయ్యాక జట్టులో మెంటార్‌గా చేరి గత 10 ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఐపీఎల్‌లో మెంటార్‌గా ఉన్నాడు. సెహ్వాగ్ 2016 నుంచి 2018 వరకు పంజాబ్ కింగ్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన జహీర్ ఖాన్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ డెవలప్‌మెంట్ వింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ కోచ్‌తో సమానంగా పరిగణించబడుతుంది. జహీర్ ఈ పాత్రలో ఆటగాళ్లను అద్భుతంగా డైరెక్ట్ చేశాడన్న పేరుంది. 2011 వన్డే ప్రపంచకప్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ కూడా త్వరలో కోచింగ్ రంగంలోకి ప్రవేశించనున్నాడు. తాజా నివేదికల ప్రకారం వచ్చే ఐపీఎల్ సీజన్లో యువరాజ్ సింగ్ గుజరాత్ జట్టుకు మెంటర్ గా మారే పరిస్థితి కనిపిస్తుంది. నెహ్రా జిటి నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో యువీ ఆ కీలక పదవి చేపట్టబోతున్నాడు.

Also Read: Meta AI: మెటాతో చాట్ చేస్తున్నారా? ఇకపై ఏడు భాషల్లో అందుబాటులోకి

Exit mobile version