American Cricket Team : టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా కెప్టెన్ మనోడే.. మోనాంక్ కెరీర్ గ్రాఫ్ ఇదిగో

American Cricket Team : టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అమెరికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ జూన్ 1న అమెరికా, కెనడా మధ్య జరగనుంది. 

Published By: HashtagU Telugu Desk
American Cricket Team

American Cricket Team

American Cricket Team : టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అమెరికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ జూన్ 1న అమెరికా, కెనడా మధ్య జరగనుంది.  ఈ తరుణంలో అమెరికా టీమ్‌ను ఒక భారత సంతతి ఆటగాడు  కెప్టెన్‌గా లీడ్ చేయబోతున్నాడు. అతడు ఎవరు ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. ఆ ప్లేయర్ పేరే.. మోనాంక్ పటేల్. ఈయన స్వస్థలం గుజరాత్. గతంలో గుజరాత్ స్టేట్ టీమ్ తరఫున కూడా మ్యాచ్‌లు ఆడాడు. 2018 సంవత్సరం నుంచి అమెరికా తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా టీమ్స్ ఉన్నాయి. ఈ గ్రూపులో భారత్, పాక్ చాలా బలంగా ఉన్నాయి. కెనడా, అమెరికాలతో పోల్చుకుంటే ఐర్లాండ్ టీమే బలమైందని అంటున్నారు. ఈ తరుణంలో కెనడాతో జరుగుతున్న మొదటి మ్యాచ్‌ను లీడ్ చేయడం.. మోనాంక్ పటేల్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. కెప్టెన్‌గా ఉండటంతో సహజంగానే ఆయనపై ఒత్తిడి ఉంటుంది. దీన్ని అధిగమించి మ్యాచ్ కోసం వ్యూహం సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ ఏడాది జులై 14 నుంచి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ జరగబోతున్నాయి. ఈసారి ఒలింపిక్ గేమ్స్ లిస్టులో క్రికెట్ కూడా ఉంది.  వాటికి సన్నాహకంగానే  ఇప్పుడు టీ20 క్రికెట్ వరల్డ్ కప్‌కు అమెరికా ఆతిథ్యమిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

  • మోనాంక్ పటేల్ 1993 మే 1న గుజరాత్‌లోని ఆనంద్‌లో జన్మించాడు.
  • ఇతడు కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌తో పాటు వికెట్ కీపర్ కూడా.
  • గుజరాత్ తరఫున అండర్ -16, అండర్ -18 జట్లలో ఆడాడు.
  • 2010లో పటేల్‌కు అమెరికా గ్రీన్ కార్డ్ లభించింది.
  • 2016 నుంచి ఇతడు అమెరికాలోనే నివసిస్తున్నాడు.
  • 2018లో జరిగిన ICC వరల్డ్ T20 అమెరికాస్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో అతడు ఆరు మ్యాచ్‌లలో 208 రన్స్ చేశాడు.
  • 2018 అక్టోబర్‌ లో జరిగిన రీజినల్ సూపర్-50 టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన అమెరికా క్రికెట్ జట్టులో కూడా మోనాంక్ ఉన్నాడు. ఆ టోర్నీలో జమైకాపై సెంచరీ చేశాడు. దీంతో సెంచరీ చేసిన తొలి అమెరికా క్రికెటర్‌గా రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ టోర్నీలో మోనాంక్  7 మ్యాచ్‌లలో 290 రన్స్ చేశాడు.
  • మరుసటి నెలలోనే అతడిని మళ్లీ ICC టోర్నమెంట్‌లో అమెరికా క్రికెట్ టీమ్‌లోకి తీసుకున్నారు. తొలి మ్యాచ్‌లో ఉగాండాపై 107 రన్స్ చేశాడు.
  • మోనాంక్ పటేల్ 2019 మార్చి 15న టీ20 ఇంటర్నేషనల్‌ టోర్నీలోకి అరంగేట్రం చేశాడు. UAEతో తన మొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.
  • 2019 ఏప్రిల్ 27న మోనాంక్ అమెరికా టీమ్ తరఫున తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను పాపువా న్యూ గినియాతో ఆడాడు.
  • 2021 ఆగస్ట్‌లో ఒమన్‌ వేదికగా జరిగిన ట్రై నేషన్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో పటేల్ సెంచరీ చేశాడు. ఇది అతడికి తొలి అంతర్జాతీయ సెంచరీ.
  • 2021 అక్టోబరులో అతడు అమెరికన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు.

Also Read: Train Fire : బంగ్లాదేశ్‌లో రైలుకు నిప్పంటించిన మూకలు.. ఐదుగురి మృతి

  Last Updated: 06 Jan 2024, 08:59 AM IST