Site icon HashtagU Telugu

Shashank Singh: ఎవ‌రీ శ‌శాంక్ సింగ్‌.. వేలంలో పొరపాటున కొనుగోలు చేసిన‌ పంజాబ్‌..!

Shashank Singh

Safeimagekit Resized Img (3) 11zon

Shashank Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో 42వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పీబీకేఎస్ బ్యాట్స్‌మెన్ శశాంక్ సింగ్ (68*) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్‌లో అతని (Shashank Singh) బ్యాటింగ్‌లో ఇది రెండో అర్ధ సెంచరీ. అతని సూప‌ర్ ఇన్నింగ్స్ కారణంగా PBKS కేవలం 2 వికెట్లు కోల్పోయి 262 పరుగుల రికార్డు లక్ష్యాన్ని సాధించింది. ఇటువంటి పరిస్థితిలో అతని ఇన్నింగ్స్, గణాంకాలను చూద్దాం.

శశాంక్ ఇన్నింగ్స్ ఎలా ఉంది?

178 పరుగుల వద్ద పీబీకేఎస్ రెండో వికెట్ కోల్పోయిన సమయంలో శశాంక్ క్రీజులోకి వచ్చాడు. అతను ఒత్తిడి పరిస్థితుల్లో బాగా బ్యాటింగ్ చేసి జానీ బెయిర్‌స్టోకు మంచి సహకారం అందించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 28 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని IPL కెరీర్‌లో 19 మ్యాచ్‌లలో 41.5 సగటుతో, 173.82 స్ట్రైక్ రేట్‌తో 332 పరుగులు చేశాడు.

Also Read: Egg Freezing: ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి..? ఈ ప్ర‌క్రియ‌కు ఎంత ఖ‌ర్చువుతుందో తెలుసా..?

అద్భుత ఫామ్‌లో ఉన్నాడు

ఐపీఎల్ 2024లో శశాంక్ బ్యాట్ బలంగా మాట్లాడుతోంది. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన అతను 5 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. తన బ్యాటింగ్‌తో 65.75 అద్భుతమైన సగటుతో 263 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 182.64. ఈ సీజన్‌లో 2 అర్ధ సెంచరీలు సాధించాడు. గత సీజన్‌లో ఈ ఆటగాడు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. PBKS కంటే ముందు శశాంక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో సభ్యుడు.

ఛత్తీస్‌గఢ్‌ తరఫున ఆడుతున్నాడు

ముంబైలో నవంబర్ 21, 1991లో జన్మించిన శశాంక్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. దూకుడు బ్యాటింగ్‌తో పాటు, ఉపయోగకరమైన ఆఫ్ స్పిన్‌ను కూడా బౌలింగ్ చేస్తాడు. శశాంక్ 2015లో ముంబై క్రికెట్ జట్టు తరపున లిస్ట్-ఎ, టి-20 అరంగేట్రం చేశాడు. దీని తరువాత 2019 సంవత్సరంలో అతను ఛత్తీస్‌గఢ్ క్రికెట్ జట్టు కోసం తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసాడు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ జట్టుతో మాత్రమే దేశీయ క్రికెట్‌లో ఆడుతున్నాడు.

We’re now on WhatsApp : Click to Join

ఎవ‌రీ శశాంక్ సింగ్‌..?

శశాంక్ సింగ్ దేశవాళీ క్రికెట్‌లో ఛత్తీస్‌గఢ్ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్-2024 వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని రూ. 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. అయితే వేరే ఆటగాడిని కొనుగోలు చేయబోయి పొరపాటున ఇతడిని దక్కించుకుంది. శశాంక్ అనే మరో క్రికెటర్‌ను తీసుకోబోయి కన్ఫ్యూజన్‌లో ఇతడిని కొనుగోలు చేసింది. శ‌శాంక్ సింగ్‌ను త‌మ జ‌ట్టును త‌ప్పించాల‌ని పంజాబ్ ఐపీఎల్ నిర్వాహ‌కుల‌ను కూడా సంప్రదించింది. అయితే వేలం త‌ర్వాత ఎటువంటి మార్పులు ఉండ‌వ‌ని చెప్ప‌టంతో పంజాబ్ కింగ్స్ చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయింది.