ఐపీఎల్ మెగా వేలంలో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ జాక్‌పాట్ కొట్టాడు. ఈ యువ ఆటగాడు 1.7 కోట్లకు అమ్ముడయ్యాడు. 2020 అండర్ 19 ప్రపంచకప్‌లో రాణించిన తిలక్ వర్మ గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడ్డాయి. చివరికి ఈ యువ ఆటగాడిని ముంబై ఇండియన్స్ 1.7 కోట్లకు దక్కించుకుంది. 15 టీ ట్వంటీల్లో 381 పరుగులు చేసిన తిలక్ వర్మ లిస్ట్ ఎ క్రికెట్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీలో 19 ఏళ్ళ తిలక్ వర్మ 180 పరుగులు చేశాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. తిలక్ వర్మ ఇప్పటి వరకు లిస్ట్-ఏలో ఇప్పటిదాకా 16 మ్యాచ్‌లు ఆడాడు. 784 పరుగులు చేశాడు. అతని హయ్యెస్ట్ స్కోర్ 156. బ్యాటింగ్ యావరేజ్ 52.26. లిస్ట్-ఏ, దేశవాళీ టీ20 మ్యాచ్‌లల్లో భారీ స్కోర్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం టీమిండియా అండర్-19లో బ్యాటింగ్ బ్యాక్‌బోన్‌గా గుర్తింపు పొందాడు. 2018-19 సీజన్‌లో రంజీట్రోఫీ సందర్భంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఆడాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు వేలంలో ముంబై..ఇండియన్స్ తిలక్‌ను దక్కించుకుంది. తిలక్‌వర్మకు భారీ ధర లభించడంపై అతని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
IPL 2022 Auction: హైదరాబాదీ క్రికెటర్ తిలక్‌వర్మకు జాక్‌పాట్

Tilak Varma