Site icon HashtagU Telugu

Maaya Rajeshwaran : రైజింగ్ టెన్నిస్ స్టార్ మాయా రాజేశ్వరణ్.. ఎవరామె ?

Maaya Rajeshwaran Rafa Nadal Academy Mumbai Wta 125 Semis

Maaya Rajeshwaran : సానియా మీర్జా తరహాలో మరో టెన్నిస్ స్టార్ మెరుపు వేగంతో రైజ్ అవుతోంది. ఆమె పేరు మాయా రాజేశ్వరణ్ రేవతి. వయసు 15 ఏళ్లు. మాయా రాజేశ్వరణ్ ఆటతీరు సెరెనా విలియమ్స్, సబలెంకాలను పోలి ఉందని క్రీడారంగ పరిశీలకులు అంటున్నారు. ‘వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్’ (డబ్ల్యూటీఏ) పాయింట్‌ను సాధించిన అతిపిన్న వయస్కురాలైన భారత టెన్నిస్ ప్లేయర్‌‌గా మాయా రాజేశ్వరణ్ రికార్డును సొంతం చేసుకుంది. నిలకడగా రాణిస్తూ ఆమె అందరి మన్ననలు అందుకుంటోంది. ఎల్ అండ్ టీ ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ 125 సిరీస్‌ ఈవెంట్‌లో మాయా రాజేశ్వరణ్ అసాధారణ ప్రదర్శనను కనబర్చింది. ఇటలీకి చెందిన 264వ ప్రపంచ ర్యాంకర్ నికోల్ ఫోస్సా హ్యూర్గోపై గెలిచి మరీ  సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. తద్వారా డబ్ల్యూటీఏ పాయింట్ సాధించిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా రికార్డును సొంతం చేసుకుంది.

Also Read :Big Cheating : హీరోయిన్ చేస్తామంటూ మాజీ సీఎం కూతురికి రూ.4 కోట్లు కుచ్చుటోపీ

ఎవరీ మాయా ?