యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

ప్రశాంత్ వీర్ ఇప్పుడు ఐపీఎల్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. వేలంలో ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల 20 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

Published By: HashtagU Telugu Desk
CSK

CSK

  • ఐపీఎల్ వేలంలో యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం
  • అన్‌క్యాప్డ్ ఆట‌గాళ్ల‌ను భారీ ధ‌ర‌కు జ‌ట్టులో చేర్చుకున్న సీఎస్కే

CSK: ఆకిబ్ నబీ డార్, ప్రశాంత్ వీర్‌ల‌ తర్వాత ఐపీఎల్ 2026 వేలంలో కార్తీక్ శర్మ పేరు సంచలనంగా మారింది. కేవలం రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ. 14.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ భారీ ధరతో కార్తీక్ శర్మ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

వేలం సాగిందిలా

కార్తీక్ శర్మ కోసం మొదట ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. లక్నో తప్పుకున్నాక చెన్నై సూపర్ కింగ్స్ రంగంలోకి దిగి కేకేఆర్‌తో తలపడింది. చివరకు రూ. 14.20 కోట్లకు 19 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సీఎస్కే దక్కించుకుంది.

Also Read: వెంకటేష్ అయ్యర్‌కు భారీ షాక్.. రూ. 16.75 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆల్‌రౌండర్!

ఎవరీ కార్తీక్ శర్మ?

కార్తీక్ శర్మ భారత దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతను భారీ షాట్లు ఆడటంలో దిట్ట. మెరుపు స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (2025-26) సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 160 స్ట్రైక్ రేట్‌తో 133 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో వచ్చి భారీ షాట్లు కొడుతూ ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషించగలడు. రాజస్థాన్ తరపున అండర్-14, అండర్-16 స్థాయిలో ఆడి మంచి పేరు సంపాదించాడు. ఇప్పటివరకు ఆడిన 12 టీ20 మ్యాచ్‌ల్లో సుమారు 163 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేశాడు. వికెట్ కీపింగ్ నైపుణ్యంతో పాటు హిట్టింగ్ పవర్ ఉండటం వల్ల రాబోయే సీజన్‌లో ఇతను చాలా జట్లకు కీలక ఆటగాడిగా మారే అవకాశం ఉంది.

ప్రశాంత్ వీర్ ఇప్పుడు ఐపీఎల్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. వేలంలో ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్ల 20 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ అయిన ప్రశాంత్ బేస్ ప్రైస్ కేవలం రూ. 30 లక్షలు మాత్రమే. యూపీ టీ20 లీగ్‌లో అతని అద్భుత ప్రదర్శనను చూసి సన్‌రైజర్స్ హైదరాబాద్, సీఎస్‌కే జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఐపీఎల్ 2026 వేలంలో సీఎస్‌కే కొనుగోలు చేసిన మొదటి ఆటగాడు వెస్టిండీస్ ప్లేయర్ అఖీల్ హుస్సేన్. ఇతడిని తన బేస్ ప్రైస్ అయిన రూ. 2 కోట్లకు దక్కించుకుంది.

  Last Updated: 16 Dec 2025, 05:59 PM IST