Ranji Trophy: దుమ్ము రేపుతున్న షమీ తమ్ముడు.. భువీ విధ్వంసం

భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం రంజీలో ఆడుతున్నాడు. కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన భువీ మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు చమటోడుస్తున్నాడు. బెంగాల్‌- ఉత్తర్‌ప్రదేశ్‌ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌ లో భువీ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. 

Ranji Trophy: భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం రంజీలో ఆడుతున్నాడు. కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన భువీ మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు చమటోడుస్తున్నాడు. బెంగాల్‌- ఉత్తర్‌ప్రదేశ్‌ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌ లో భువీ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు.

మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగాల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ మనోజ్‌ తివారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు చెలరేగారు. బెంగాల్‌ బౌలర్ల దెబ్బకు ఉత్తర్‌ప్రదేశ్‌ కేవలం 20.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్‌ షమీ తమ్ముడు మహ్మద్‌ కైఫ్‌ నాలుగు వికెట్లతో యూపీ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత భువనేశ్వర్ వంతొచ్చింది. ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన బెంగాల్‌ను భువనేశ్వర్‌ కుమార్‌ వణికించేశాడు . బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వకుండా నిప్పులు చెరిగే బంతులు సంధించాడు. ఇన్నింగ్స్ లో పొదుపుగా బౌలింగ్‌ చేసిన భువీ 1.90 ఎకనామీతో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్‌ దెబ్బకు ఓపెనర్‌ సౌరవ్‌ పాల్‌ 13, సుదీప్‌ కుమార్‌ ఘరామి 0, అనుస్తుప్‌ మజుందార్‌ 12, మనోజ్‌ తివారి 3, అభిషేక్‌ పోరెల్‌ 12 పరుగులకే పెవీలియన్ చేరారు. దీంతో ఈ మ్యాచ్ భువీ వర్సెస్ షమీ తమ్ముడు కైఫ్ అన్నట్టుగా మారింది.

Bhuvneshwar Kumar

చిన్నప్పటి నుండి అన్న శమిని ఫాలో అవుతున్న కైఫ్ అంతర్జాతీయ జట్టులోకి రావాలని ఆశపడ్డాడు. తనకంటే ఆరేళ్ల పెద్దవాడైన షమీ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతుండటంతో కైఫ్ మరింత స్ఫూర్తి పొందాడు. ప్రస్తుతం రంజీ మ్యాచుల్లో సత్తా చాటుతున్న కైఫ్ స్పీడ్, సీమ్, స్వింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. 2021లో జమ్ము కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌తో బెంగాల్‌ తరఫున క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విజయ్‌ హజారే టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. గోవాపై మూడు వికెట్లను పడగొట్టాడు. బరోడా, తమిళనాడు, పంజాబ్, హరియాణాపై కూడా రెండు వికెట్ల చొప్పున పడగొట్టాడు. 2021 బెంగాల్‌ టీ20 ఛాలెంజ్‌ టోర్నీలో ఖరగ్‌పూర్‌ బ్లాస్టర్స్‌ తరపున ఆడి 7 వికెట్లతో రాణించాడు.

Also Read: AIIMS Mangalagiri : మంత్లీ శాలరీ 2 లక్షలకుపైనే.. మంగళగిరి ఎయిమ్స్‌లో జాబ్స్