Site icon HashtagU Telugu

Ashwin Call Log: వైరల్ అవుతున్న అశ్విన్ కాల్ లాగ్

Ashwin Call Log

Ashwin Call Log

Ashwin Call Log: బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కాసేపట్లోనే ప్రెస్ మీట్ లో అశ్విన్ (Ashwin Call Log) బాంబ్ పేల్చాడు. 14 ఏళ్ళ తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకోవడం సగటు క్రికెట్ అభిమానిని బాధించింది. ప్రత్యర్థి జట్టును తన స్పిన్ మాయాజాలంతో ముప్పు తిప్పలు పెట్టె అశ్విన్ ఇక క్రికెట్ ఆడడన్న వార్తను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. కానీ క్రికెట్ ప్రపంచంలో ఇలాంటి బాధాకర సంఘటనలు చోటుచేసుకోవడం కామనే. ఇదిలా ఉంటే తాజాగా అశ్విన్ తన ఫోన్ కాల్ లాగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇష్యూని మరింత హీట్ పుట్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ కి ఇతర క్రికెటర్లు కాల్స్ చేసి విష్ చేస్తున్నారు. టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందించిన అశ్విన్ విజయాలను గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో అశ్విన్ కి సచిన్ మరియు కపిల్ దేవ్ కాల్స్ చేసి అతడితో మాట్లాడారు. ఈ విషయాన్నీ అశ్విన్ స్క్రీన్ షాట్ తీసి తన అనుభూతులను పంచుకున్నాడు. అశ్విన్ కాల్ లాగ్ లో తండ్రి రవిచంద్రన్ పేరు ముందుంది. ఆ తర్వాత సచిన్ కాల్స్ చేశాడు. ఇక 1983లో టీమిండియాను తొలిసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టిన కపిల్ దేవ్ అశ్విన్ కి వాట్సాప్ కాల్ చేసి మాట్లాడాడు. ఈ సందర్భంగా అశ్విన్ ఆ కాల్ లిస్టును సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ పోస్టులో సచిన్, కపిల్ దేవ్ లకు ధన్యవాదాలు తెలిపాడు.

Also Read: Look Back 2024 : భారత్ సాధించిన గొప్ప విజయాలివే!

అశ్విన్ రిటైర్మెంట్ పై తండ్రి రవిచంద్రన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో టీం మేనేజ్మెంట్ పై సంచలన కామెంట్స్ చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అశ్విన్ ని తుది జట్టులోకి తీసుకోకపోవడం వల్లనే అవమానానికి గురైనట్టు అశ్విన్ తండ్రి తెలిపారు. అశ్విన్ ని మేనేజ్‌మెంట్ సరిగా ట్రీట్ చేయలేదని స్పష్టం చేశాడు. ఈ కారణంగానే తన కొడుకు రిటైర్మెంట్ ప్రకటించాడని టీమిండియా సెలెక్టర్లపై మండిపడ్డారు అశ్విన్ తండ్రి.