Messi: కల నెరవేరిన వేళ

ఎన్నో ట్రోఫీలు గెలిచాడు.. ఎన్నో రికార్డులు అందుకున్నాడు..సమకాలిన ఫుట్‌బాల్ అతను ఖచ్చితంగా అతను గ్రేట్ ప్లేయరే..

  • Written By:
  • Updated On - December 19, 2022 / 12:11 PM IST

ఎన్నో ట్రోఫీలు గెలిచాడు.. ఎన్నో రికార్డులు అందుకున్నాడు..సమకాలిన ఫుట్‌బాల్ అతను ఖచ్చితంగా అతను గ్రేట్ ప్లేయరే.. అయినప్పటకీ ఒక లోటు మాత్రం అలాగే ఉండిపోయింది…అదే ప్రపంచకప్‌ గెలవడం..ఇప్పుడు ఆ కలను కూడా నెరనేర్చుకున్నాడు. అతనెవరో కాదు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ..ఇప్పుడు మెస్సీ ఒక దిగ్గజం.. అర్జెంటీనాకు మారడోనా తర్వాత వరల్డ్‌కప్ అందించిన ప్లేయర్‌గా నిలిచాడు. అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ నిరీక్షణ ఫలించింది. దిగ్గజ ప్లేయర్ మారడోనా మ్యాజిక్‌ను ఈతరంలో కంటిన్యూ చేస్తూ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన మెస్సీ కెరీర్‌లో ఎన్నో టైటిల్స్‌, అవార్డులు కొల్లగొట్టాడు.

అయినా ఫిఫా వరల్డ్‌కప్‌ సాధించలేదన్న లోటు మాత్రం అలానే ఉండిపోయింది. 2014లో ఫిఫా వరల్డ్‌కప్‌ మెస్సీ చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అయితే ఈసారి మాత్రం మెస్సీనే వరించింది. ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్‌ అని ప్రకటించిన మెస్సీ టైటిల్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. మారడోనా తర్వాత తనను ఎందుకంత ఆరాధిస్తారనేది మెస్సీ ఈ టోర్నీ ద్వారా మరోసారి నిరూపించాడు.

నిజానికి మెస్సీ గెలవడం కోసమే ఈసారి ఫిపా వరల్డ్‌కప్‌ జరిగిందా అన్న అనుమానం రాకమానదు. సౌదీ అరేబియాతో ఓటమి అర్జెంటీనాను పూర్తిగా మార్చేసింది. సౌదీ చేతిలో ఓటమి ఆ జట్టుకే సాకర్ ప్రపంచానికే షాక్. అయితే ఆ ఓటమితో కుంగిపోని మెస్సీ అన్నీ తానై జట్టును నడిపించాడు. అక్కడి నుంచి మొదలైన మెస్సీ మ్యాజిక్ ఫైనల్‌ వరకు కొనసాగింది. జట్టు తరపున అత్యధిక గోల్స్‌ కొట్టడమే కాదు అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు.
2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన మెస్సీ 17 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌ అందుకోవాలన్న తన కలను నిజం చేసుకున్నాడు. అంతేకాదు డీగో మారడోనా తర్వాత అర్జెంటీనాకు వరల్డ్‌కప్‌ అందించి చరిత్ర సృష్టించాడు. ఇక ఇప్పుడు మెస్సీ ఒక చరిత్ర. ఇన్నాళ్లు అర్జెంటీనా సూపర్‌స్టార్‌గా అభివర్ణించిన మెస్సీ తనను దిగ్గజం అని పిలిపించుకోవడానికి అన్ని అర్హతలు సాధించాడు. ఈ తరానికి మెస్సీనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్ అని అంగీకరించాల్సిందే.