Site icon HashtagU Telugu

Final Match: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఏ జ‌ట్లు ఫైన‌ల్‌కు వెళ్తాయో తెలుసా..?

ICC

ICC

Final Match: ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ చివరి దశ కొనసాగుతోంది. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జూన్ 27న జరగనున్నాయి. తొలి సెమీఫైనల్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనుండగా, రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా సెమీఫైనల్‌లు రద్దైతే ఏ జట్లకు లాభం, ఏ జట్లు ఫైనల్స్‌ (Final Match)కు వెళ్తాయనే ప్రశ్న ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించి అభిమానుల మదిలో మెదులుతోంది.

వర్షం పడితే ఎవరికి లాభం?

ప్రపంచకప్‌లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగనుంది. ప్రస్తుతం గ్రూప్-2లో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో, ఆఫ్ఘనిస్థాన్ రెండో స్థానంలో ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఈ రెండు జట్లలో ఎవరు ఫైనల్స్‌కు చేరుకుంటారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

Also Read: Head Replaces Suryakumar: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు బిగ్ షాక్‌.. టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్ వ‌న్‌గా ట్రావిస్ హెడ్‌..!

ఐసీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్‌ మ్యాచ్‌లో వర్షం కురిసి మ్యాచ్‌ రద్దైతే.. గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌లో చోటు దక్కించుకుంటుంది. కాగా గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టు ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే పరిస్థితి భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్‌కు వర్తిస్తుంది. వర్షం కారణంగా సెమీఫైనల్‌లు రద్దైతే, టీమ్ ఇండియా నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశించగా, ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచకప్ నుండి నిష్క్రమిస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

సెమీ-ఫైనల్‌లో నాలుగు జట్లు

ఏ జట్టు ఎవరిని ఓడించి సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది?

ఇటీవ‌ల ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌ విజయంతో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లు నిష్క్రమించాయి. ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా సెమీస్‌కు అర్హత సాధించింది. ఇంగ్లండ్‌ను ఓడించి దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్ టిక్కెట్‌ను ఖాయం చేసుకోగా, ఇంగ్లండ్ అమెరికాను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.