world cup 2023: ఆ 4 టీమ్స్ కి సెమిస్ బెర్త్ కన్ఫర్మ్

సెమీస్‌లో చోటు దక్కాలంటే 14 పాయింట్లు దక్కించుకోవాలి. 12 పాయింట్లు ఉన్నా పెద్ద కష్టమేమి కాదు. ఇక్కడ నెట్ రన్‌రేట్ కీలకం కాబట్టి ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు సెమీస్ ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

world cup 2023: సెమీస్‌లో చోటు దక్కాలంటే 14 పాయింట్లు దక్కించుకోవాలి. 12 పాయింట్లు ఉన్నా పెద్ద కష్టమేమి కాదు. ఇక్కడ నెట్ రన్‌రేట్ కీలకం కాబట్టి ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు సెమీస్ ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. భారత్ లీగ్ దశలో 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మూడింట్లో ఒక్కటి గెలిచినా 14 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. సౌతాఫ్రికా 6 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కనీసం రెండు గెలిస్తే ఈ జట్టు సెమీస్ చేరొచ్చు. వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ ఆ తర్వాత వరుసగా రెండు ఓడింది. అయితే రెండు గెలిచినా సౌతాఫ్రికా సెమిస్ కి చేరొచ్చు.. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెండు టీమ్స్ పరిస్థితి దాదాపు సమానంగా ఉంది. ఇరు జట్లు 2 మ్యాచ్‌ల చొప్పున ఓడాయి. ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో ఆసీస్ ఆడనుంది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈజీగా సెమీస్ చేరొచ్చు. అనూహ్యంగా సెమిస్ రేస్ లోకి దూసుకొచ్చిన అఫ్గానిస్థాన్ 3 విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ఆఫ్ఘన్ నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో ఆడాల్సి ఉంది. ఈ మూడు గెలిస్తేనే ఆఫ్ఘన్ కు సెమీస్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. నెట్‌ రన్‌రేట్ కూడా మెరుగ్గా ఉండాలి.

Also Read: Chandrababu: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ధన్యవాదాలు: చంద్రబాబు