world cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా 29వ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 129 పరుగులకే ఆలౌట్ అయింది.
లక్నోలోని ఎకానా స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 230 పరుగులకు సమాధానంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. షమీ నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్‌కు రెండు వికెట్లు లభించగా, జడేజాకు ఒక వికెట్ దక్కింది. భారత్ తరఫున రోహిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. హిట్‌మన్ 87 పరుగులు చేశాడు. రోహిత్ 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. బ్యాటింగ్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరిచినా.. దాన్ని బౌలర్లు భర్తీ చేశారు. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అదే సమయంలో సెమీ ఫైనల్ రేసు నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించింది.
ఇక పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. 6 మ్యాచ్‌ల్లో టీమిండియా 12 పాయింట్లు సాధించింది. భారత్ సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం. అదే సమయంలో దక్షిణాఫ్రికా రెండో స్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా 6 మ్యాచ్‌ల్లో 5 గెలిచింది. ఆ జట్టుకు 10 పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది.
Also Read: world cup 2023: సెంచరీ మ్యాచ్ లో రోహిత్ అదుర్స్.. హిట్ మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ పై ప్రశంసలు