Asia Cup 2023 Final: ఆసియా క్రికెట్ సంగ్రామం ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. 2023 ఆసియా కప్‌లో సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. 2023 ఆసియా కప్ పాకిస్థాన్, శ్రీలంకలో జరగనుంది. దీనికి ముందు 2023 ఎమర్జింగ్ ఆసియా కప్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ఈ టోర్నీ కూడా చివరి దశలో ఉంది. 2023 ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత్-ఎ, పాకిస్థాన్-ఎ జట్లు ఫైనల్స్ (Asia Cup 2023 Final)లోకి ప్రవేశించాయి. ఇరు జట్లు తమ తమ సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు నమోదు చేశాయి. ఇప్పుడు రెండు జట్లు రేపు అంటే ఆదివారం జూలై 23న టైటిల్ మ్యాచ్ ఆడనున్నాయి.
తొలి సెమీఫైనల్‌లో శ్రీలంక ఎపై పాకిస్థాన్ ఎ విజయం
2023 ఎమర్జింగ్ ఆసియా కప్‌లో మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ పాకిస్థాన్-ఎ, శ్రీలంక-ఎ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్-ఎ జట్టు సులువుగా విజయం సాధించింది. తొలుత పాక్-ఎ 50 ఓవర్లలో 322 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక-ఎ జట్టు 45.4 ఓవర్లలో 262 పరుగులకే ఆలౌటైంది. పాకిస్థాన్-ఎ తరఫున ఉమైర్ యూసుఫ్ 88, కెప్టెన్ మహ్మద్ హారీస్ 52 పరుగులు చేశారు. అదే సమయంలో శ్రీలంక-ఎ తరఫున అవిష్క ఫెర్నాండో అత్యధికంగా 97 పరుగులు చేశాడు.
రెండో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్ ఎపై భారత్ ఎ విజయం
ఆసియా కప్‌లో రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో తక్కువ స్కోరింగ్ జరిగింది. తొలుత ఆడిన భారత్-ఎ జట్టు 49.1 ఓవర్లలో కేవలం 211 పరుగులకే కుప్పకూలింది. దీని తర్వాత బంగ్లాదేశ్-ఎ జట్టు వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసినా, భారత బౌలర్లు ధీటుగా పుంజుకుని చివరకు 51 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. భారత్-ఎ తరఫున నిశాంత్ సంధు అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు.
ఫైనల్ మ్యాచ్ పూర్తి వివరాలు
ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మీరు స్టార్ స్పోర్ట్స్ 1 హిందీలో టీవీలో ఇండియా A, పాకిస్తాన్ A మధ్య మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు.