IND vs NZ 3rd ODI: రేపే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ చివరి వన్డే..!

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా IND vs NZ మూడో వన్డే రేపే జరగనుంది.

Published By: HashtagU Telugu Desk
India Squad

TEAMINDIA

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా IND vs NZ  మూడో వన్డే రేపే జరగనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే కివీస్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇందులో టీమ్ఇండియా గెలిస్తే సిరీస్‌ సమమవుతుంది. ఒకవేళ కివీస్‌ విజయం సాధిస్తే మాత్రం సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. అయితే మ్యాచ్ జరిగే క్రైస్ట్‌చర్చ్‌లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఉదయం 7 గంటలకే మ్యాచ్ ప్రారంభం కానుంది.

శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమ్ ఇండియా బుధవారం క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో న్యూజిలాండ్‌తో జరిగే మూడో, చివరి వన్డేలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేయాలని చూస్తుంది. తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోగా, రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. 2వ ODI కోసం సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్ కంటే ముందుగా దీపక్ హుడా, దీపక్ చాహర్‌లకు అవకావం ఇచ్చారు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3వ వన్డే బుధవారం జరగనుంది. భారత్ vs న్యూజిలాండ్ మధ్య 3వ వన్డే ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది.

భారత వన్డే జట్టు: శిఖర్ ధావన్ (C), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), సంజు శాంసన్ (WK), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్.

న్యూజిలాండ్ వన్డే జట్టు: కేన్ విలియమ్సన్ (సి), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ.

 

  Last Updated: 30 Nov 2022, 08:29 AM IST