Team India Future: కోహ్లీ, రోహిత్ తర్వాత కుర్రాళ్ళదే టీమిండియా

టీమిండియాని దశాబ్దకాలం పాటు మహేంద్ర సింగ్ ధోనీ ముందుకు నడిపించాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు టీమిండియా మరో వెస్టిండీస్ అవుతుందనుకున్నారు. కానీ విరాట్ ధోనీ స్థానాన్ని తీసుకుని సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ప్రస్తుతం జట్టులో రోహిత్, విరాట్, జడేజా, అశ్విన్

Team India Future: టీమిండియాని దశాబ్దకాలం పాటు మహేంద్ర సింగ్ ధోనీ ముందుకు నడిపించాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు టీమిండియా మరో వెస్టిండీస్ అవుతుందనుకున్నారు. కానీ విరాట్ ధోనీ స్థానాన్ని తీసుకుని సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ప్రస్తుతం జట్టులో రోహిత్, విరాట్, జడేజా, అశ్విన్ సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. అయితే సీనియర్ ప్లేయర్లు మరెంతో కాలం క్రికెట్లో కొనసాగే పరిస్థితి లేదు. మరో రెండు సంవత్సరాల్లో ఈ నలుగురు ఆటగాళ్లు క్రికెట్ గు గుడ్ బై చెప్పేయొచ్చు.

సీనియర్లు లేని క్రికెట్ జట్టుని ఊహించడం కష్టమే. జట్టు విజయం సాదించాలి అంటే ప్రతిభ మాత్రమే ఉంటె సరిపోదు. క్లిష్ట పరిస్థితుల్లో చకచకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి సొంత జట్టులో విభేదాలు పుట్టుకొస్తాయి. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. ఈ జర్నీలో కొన్ని సార్లు శత్రువులు పుట్టుకొస్తారు. అవేం పట్టించుకోకుండా జట్టును ముందుకు నడిపించాలి. ప్రస్తుతం జట్టులో కుర్రాళ్ళ హావ నడుస్తుంది. సీనియర్లకు పోటీగా అద్భుతంగ ఆడుతున్నారు.

దేశవాళీల్లో టోర్నీలో పరుగుల వరద పారించి టీమ్‌ఇండియాలో అడుగుపెట్టిన సర్ఫరాజ్​ ఖాన్ మోత మోగిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెలెక్టర్లతో శభాష్ అనిపించుకున్నాడు. మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో మెరుపు వేగంతో హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయాడు. సర్ఫరాజ్ రాకతో మిడిలార్డర్ సమస్య తీరినట్టేనని అంటున్నారు అనలిస్టులు. కెరీర్‌ ఆరంభంలో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్‌ గిల్‌ ఈ మధ్య బ్యాడ్ ఫామ్ తో నిరాశపరుస్తున్నాడు. అయినప్పటికి గిల్ టీమిండియాకు బెస్ట్ అని చెప్పవచ్చు. కష్టాల్లో ఉన్న జట్టును నిలబెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు గిల్ చెలరేగిపోతాడు. తన అవసరం ఉందన్న ప్రతిసారి బ్యాట్ కు పని చెప్తాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో విశాఖ వేదికగా సెంచరీ చేసి సత్తా చాటాడు. రాజ్‌కోట్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 రన్స్​ చేశాడు. నాలుగో టెస్టులో 52 నాటౌట్ గా నిలిచాడు.

మరో ప్లేయర్ యశస్వి గురించి చెప్పుకోవాలి. రెండు డబుల్ సెంచరీలతో ప్రత్యర్డుల్ని హడలెత్తించాడు. రోహిత్ తో కలిసి జశస్వి వీరవిహారం చేస్తున్నాడు. మరో ప్లేయర్ ధృవ్ జురెల్ .తొలి రెండు టెస్టుల్లో కేఎస్‌ భరత్‌ వైఫల్యంతో అనుకోకుండా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. పట్టుదలతో ఆడుతూ టెయిలెండర్లతో కలిసి మంచి భాస్వామ్యాన్ని నెలకొల్పుతున్నడు. ఇలా ఈ సిరీస్‌లో యంగ్ ప్లేయర్స్ బ్యాటింగ్‌ భారాన్ని తీసుకుని అద్భుతంగ జట్టును విజయతీరాలకు చేరుస్తున్నారు. దీంతో భవిష్యత్తు క్రికెట్ పై డోకా లేదని ప్రూవ్ చేశారు.

Also Read: Ambati Rambabu : జగన్ నెక్స్ట్ షాక్ ఇవ్వబోయేది అంబటికేనా…?