T20 : బూమ్రా స్థానంలో ఎవరనేది అక్కడ నిర్ణయిస్తాం : రోహిత్

టీ ట్వంటీ ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతోంది. టీమిండియా ఈ మెగా టోర్నీకి ముందు రెండు సిరీస్ లు కూడా ఆడేసి విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - October 6, 2022 / 07:22 AM IST

టీ ట్వంటీ ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతోంది. టీమిండియా ఈ మెగా టోర్నీకి ముందు రెండు సిరీస్ లు కూడా ఆడేసి విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్ లు గెలిచిన ఉత్సాహంతో ఉన్నప్పటకీ కీలక ఆటగాళ్ళు గాయాలతో వరల్డ్ కప్ కు దూరమవడం గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. జడేజా ముందే దూరమవవగా… స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా తాజాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నాడు. అసలే డెత్ ఓవర్లలో భారీగా పరుగులు ఇస్తున్న బలహీనతను అధిగమించని భారత్ కు ఇది పెద్ద షాకే. అయితే బూమ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. స్టాండ్ బై ప్లేయర్స్ జాబితాలో ఉన్న షమీ పేరే వినిపిస్తున్నప్పటకీ రోహిత్ మాత్రం దీనిపై ఆచితూచి స్పందించాడు.

బుమ్రా స్థానంలో ఎవరు అన్నదానిపై ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రోహిత్‌ చెప్పాడు. ప్రస్తుత టీమ్‌లో కొందరు మాత్రమే ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉన్నవారని ఈ నేపథ్యంలో హడావుడిగా నిర్ణయం తీసుకోలేమన్నాడు. అక్కడ కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను ఆడిన తర్వాత కాంబినేషన్‌ పై నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఆస్ట్రేలియాలో బౌలింగ్‌ చేసిన అనుభవం ఉన్న బౌలర్‌ కోసం చూడాలని రోహిత్ స్పష్టం చేశాడు.

అయితే ఆ బౌలర్‌ ఎవరన్నది తెలియదన్న హిట్ మ్యాన్ అక్కడికి వెళ్లిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చాడు. కాగా మెగా టోర్నీకి ముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనుండటం ఇండియాకు కలిసొస్తుందనన్నాడు. గత రెండు సిరీస్ లలో అత్యుత్తమ జట్లతోనే ఆడామని, కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందని భారత కెప్టెన్ చెప్పుకొచ్చాడు. కాగా బూమ్రా స్థానంలో హ్మద్‌ షమి, దీపక్‌ చహర్‌లలో ఒకరికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ లో అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో రోహిత్ సేన తొలి మ్యాచ్‌ ఆడనుంది.