Stop Clock Rule : “స్టాప్‌ క్లాక్‌” రూల్‌‌కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్.. ఇంతకీ ఇదేమిటి ?

Stop Clock Rule : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ)  మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చింది.

  • Written By:
  • Updated On - March 16, 2024 / 11:58 AM IST

Stop Clock Rule : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ)  మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఓవర్ల మధ్యలో సమయాన్ని వేస్ట్ చేయకుండా చేయడంతో పాటు మ్యాచ్‌లను త్వరగా ముగించేందుకు “స్టాప్‌ క్లాక్‌” రూల్‌ను తీసుకొస్తామని ప్రకటించింది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఈ రూల్‌ను ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ సంవత్సరం జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ నుంచి “స్టాప్‌ క్లాక్‌” రూల్‌ను పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తామని ఐసీసీ అనౌన్స్ చేసింది. వన్డేలు, టీ20 మ్యాచ్‌లలో ఈ రూల్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రయోగాత్మక అమలులో సత్ఫలితాలు వచ్చినందు వల్లే ఈ రూల్‌ను అధికారికంగా అమల్లోకి తేవాలని ఐసీసీ డిసైడ్ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ బోర్డు సమావేశాల్లో దీనిపై నిర్ణయాన్ని ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join

  • “స్టాప్‌ క్లాక్‌” రూల్‌(Stop Clock Rule) వల్ల ఓవర్‌కు ఓవర్‌కు మధ్య గ్యాప్‌ తగ్గుతుంది. దీనివల్ల ఒక ఓవర్‌ ముగిశాక.. నిమిషం వ్యవధిలోనే(60 సెకన్లలోపే) ఇంకో ఓవర్‌ ప్రారంభించాలి.
  • కొత్త బ్యాటర్‌ రావాల్సినపుడు, డ్రింక్స్‌ విరామం తీసుకున్నపుడు, ఏదైనా కారణంతో అంపైర్లు ఆటను ఆపినపుడు ఇందుకు మినహాయింపు ఉంటుంది.
  • ఫీల్డింగ్ టీమ్‌ ఓవర్‌ను ప్రారంభించేందుకు నిమిషానికి మించి వ్యవధి తీసుకుంటే అంపైర్లు రెండుసార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా సమయం మించితే మాత్రం.. బౌలింగ్‌ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు.
  • స్టాప్‌ క్లాక్‌ రూల్‌తో వన్డేల్లో దాదాపు 20 నిమిషాల టైం ఆదా అవుతుందని ఐసీసీ భావిస్తోంది.

Also Read :TG 09 0001 : టీజీ 09 0001 నంబరుకు రూ.9.61 లక్షలు

రిజర్వ్‌ డే.. మరో నిబంధన

జూన్‌ 27న జరిగే టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్, జూన్‌ 29న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌డేకు ఐసీసీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులోభాగంగా లీగ్ లేదా సూపర్‌ 8 దశలో లక్ష్య ఛేదనకు దిగిన జట్టు ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేస్తేనే ఆట పూర్తైనట్లు పరిగణిస్తారు. నాకౌట్‌ మ్యాచ్‌లలో రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సిఉంటుంది.

భారత్‌, శ్రీలంకలో టీ20 వరల్డ్ కప్

ఈ సమావేశంలో టీ20 ప్రపంచకప్‌ 2026ను భారత్‌, శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఇందులో 12 జట్లను ఆటోమేటిక్‌ క్వాలిఫైయర్లుగా పరిగణిస్తారు. వీటిలో 2024 ప్రపంచకప్‌లో టాప్‌ 8 జట్లు కాగా, మిగిలిన నాలుగు జట్లు ఐసీసీ ర్యాంకుల ఆధారంగా ఎంపికవుతాయి. మిగిలిన 8 జట్లను ఐసీసీ రీజినల్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ల ద్వారా ఎంపిక చేస్తారు.