Site icon HashtagU Telugu

New Super Over Rules: సూపర్ ఓవర్‌కు సంబంధించి కొత్త రూల్.. బీసీసీఐ గ్రీన్ సిగ్న‌ల్‌!

New Super Over Rules

New Super Over Rules

New Super Over Rules: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ మార్చి 22, శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌ నుంచి ఐపీఎల్‌లో సూపర్‌ ఓవర్‌ కొత్త నిబంధన (New Super Over Rules) అమల్లోకి రానుంది. ఈ నిబంధన ప్రకారం.. సూపర్ ఓవర్ పూర్తి చేయడానికి రెండు జట్లకు గరిష్టంగా ఒక గంట సమయం ఇవ్వ‌నున్నారు. అప్పటికి ఫలితం బయటకు రాకపోతే మ్యాచ్ ఫలితం టైగా నమోదవుతుంది.

ఐపీఎల్‌ 2025 శనివారం నుండి ప్రారంభం కానుంది. ఇక్కడ మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు BCCI సూపర్ ఓవర్‌కు సంబంధించి కొత్త నిబంధనను రూపొందించింది. దీని ప్రకారం సూపర్ ఓవర్‌ను పూర్తి చేయడానికి రెండు జట్లకు గరిష్టంగా ఒక గంట సమయం ఉంటుంది.

Also Read: IPL 2025: ఐపీఎల్‌లో నేడు తొలి మ్యాచ్‌.. టాస్ సమయం మార్పు, కార‌ణ‌మిదే?

సూపర్ ఓవర్ గురించి బీసీసీఐ ఏం చెప్పింది?

బీసీసీఐ నిబంధన ప్రకారం ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్ ఒక గంట పాటు కొనసాగుతుంది. అయితే గంటలోపే టై అయిన మ్యాచ్ ముగుస్తుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి బోర్డు.. మ్యాచ్ ముగిసిన తర్వాత విజేతను నిర్ణయించే వరకు ఎన్నిసార్లు ఎన్ని సూపర్ ఓవర్లు అయినా ఆడవచ్చు. మ్యాచ్ ముగిసిన పది నిమిషాల్లోనే మొదటి సూపర్ ఓవర్ ప్రారంభం కావాలి. వర్షం పడితే ఐపీఎల్ మ్యాచ్ రిఫరీ నిర్ణయించిన సమయానికి సూపర్ ఓవర్ ప్రారంభమవుతుందని చెబుతుంది.

ఏ సూపర్ ఓవర్ చివరిదో రిఫరీ చెబుతారు

బీసీసీఐ ఇంకా మాట్లాడుతూ.. మొదటి సూపర్ ఓవర్ టై అయితే, అది ముగిసిన ఐదు నిమిషాల తర్వాత తదుపరి సూపర్ ఓవర్ ప్రారంభించాలి. 1 గంటలోపు సూపర్ ఓవర్ పూర్తి కాదని మ్యాచ్ రిఫరీ భావిస్తే అతను చివరి సూపర్ ఓవర్ ఏ ఓవర్ అనేది కెప్టెన్‌లకు తెలియజేస్తాడు. చివరి సూపర్ ఓవర్‌లో కూడా ఫలితం రాకపోతే మ్యాచ్ టైగా ముగిసి ఇరు జట్లకు పాయింట్లు పంచుతాయని తెలుస్తోంది.