బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ద్ద ఎంత సంప‌ద ఉందంటే?

ఐసీసీ (ICC) రెవెన్యూ వాటాలో సింహభాగం బీసీసీఐకే దక్కుతుంది. బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ (ప్రసార హక్కులు) ద్వారా భారీ ఆదాయం వస్తుంది. 2023-28 కాలానికి గానూ వయాకామ్ 18 సంస్థతో రూ. 5,963 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

Published By: HashtagU Telugu Desk
BCB- BCCI

BCB- BCCI

BCB: భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొన్ని రోజులుగా రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వస్తుందా లేదా అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ (BCCI) ప్రభావం దృష్ట్యా వారితో విభేదించడం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (BCB) భారీ నష్టాన్ని కలిగించవచ్చు. ఈ వివాదం పక్కన పెడితే, అసలు ఈ రెండు క్రికెట్ బోర్డుల ఆస్తుల (Net Worth) మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.

బీసీసీఐ (BCCI) నికర ఆస్తుల విలువ

బిసిసిఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. మీడియా నివేదికల ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 18,700 కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ దాదాపు రూ. 8,963 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోందని ఇటీవలే క్రికబజ్ నివేదిక వెల్లడించింది.

Also Read: శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలేంటి?

ఆదాయ వనరులు

ఐసీసీ (ICC) రెవెన్యూ వాటాలో సింహభాగం బీసీసీఐకే దక్కుతుంది. బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ (ప్రసార హక్కులు) ద్వారా భారీ ఆదాయం వస్తుంది. 2023-28 కాలానికి గానూ వయాకామ్ 18 సంస్థతో రూ. 5,963 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీఎల్ (IPL), స్పాన్సర్‌షిప్ డీల్స్ ద్వారా కూడా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది.

బీసీసీఐ ముందు బంగ్లాదేశ్ బోర్డు (BCB) స్థితి

మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నికర ఆస్తుల విలువ కేవలం రూ. 458 కోట్లుగా అంచనా వేయబడింది. భారత క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ కంటే దాదాపు 41 రెట్లు సంపన్నమైనది. ఐసీసీ ఆదాయంలో బీసీసీఐకి 38 శాతానికి పైగా వాటా దక్కుతుండగా, బంగ్లాదేశ్ బోర్డుకు కేవలం 4.4 శాతం మాత్రమే అందుతుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL), బ్రాడ్‌కాస్టింగ్, స్పాన్సర్‌షిప్ డీల్స్ వారి ప్రధాన ఆదాయ వనరులు. గత ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ వేల కోట్లు గడించగా, బంగ్లాదేశ్ బోర్డు ఆదాయం కేవలం రూ. 350-400 కోట్ల మధ్య మాత్రమే ఉంది. మొత్తానికి ఆర్థికంగా చూసినా లేదా ప్రపంచ క్రికెట్ శక్తిగా చూసినా బీసీసీఐ దరిదాపుల్లో కూడా బంగ్లాదేశ్ బోర్డు లేదని స్పష్టమవుతోంది.

  Last Updated: 08 Jan 2026, 11:15 PM IST