Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటీ?

అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్‌లు ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే రోజునే నిర్వహిస్తారు. అందుకే ఈ రోజు ప్రారంభమయ్యే టెస్టుల్ని బాక్సింగ్ డే టెస్టులు అంటారు.

Boxing Day Test: అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన టెస్ట్ మ్యాచ్‌లు ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే రోజునే నిర్వహిస్తారు. అందుకే ఈ రోజు ప్రారంభమయ్యే టెస్టుల్ని బాక్సింగ్ డే టెస్టులు అంటారు. ఈ ఏడాది బాక్సింగ్ డే నాడు రెండు టెస్టు మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. సెంచూరియన్‌లో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు కాగా, రెండోది ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు.

డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 26ని బాక్సింగ్ డే అంటారు. చాలా మంది ఉద్యోగులు క్రిస్మస్ రోజు సెలవు తీసుకోకుండా పని చేస్తారు. మరుసటి రోజు వారికి సెలవు ఇచ్చి బహుమతులు అందజేస్తారు. ఒక సంవత్సరం కష్టానికి ప్రతిఫలంగా ఇలా బహుమతులు ప్రధానం చేస్తారు. దీనిని కూడా ఒక పండుగలా నిర్వహిస్తారు. అందుకే ఈ రోజు బాక్సింగ్ డేగా పిలుస్తారు.1865లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా-న్యూ సౌత్ వేల్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కారణంగా ఇరు జట్ల సభ్యులు మరియు సిబ్బంది బాక్సింగ్ డే వేడుకల్లో పాలు పంచుకోలేదట. దీంతో అప్పట్నుంచి ఈ రోజున ఆడే టెస్టును ఆస్ట్రేలియన్లు బాక్సింగ్ డే టెస్ట్ అంటుంటారు.

మరో కథ ఏంటంటే 1800 సంవత్సరంలో విక్టోరియా రాణి ఇంగ్లండ్‌లో సింహాసనాన్ని అధిష్టించిన రోజును బాక్సింగ్ డే అని పిలుస్తారు. కాగా తొలి బాక్సింగ్ డే టెస్టు1950లో ప్రారంభమైంది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ నే విజయం సాధించింది. 1950 నుంచి 1975 మధ్య కాలంలో కేవలం 5 బాక్సింగ్ డే టెస్టులు మాత్రమే జరిగాయి.ఆ తర్వాత బాక్సిండ్ డే రోజున క్రమం తప్పకుండ బాక్సింగ్ డే టెస్టులు పెడుతూ వస్తున్నారు.

Also Read: Drone Attack : డ్రోన్ దాడి చేసిన వాళ్లను వదలం.. సముద్ర గర్భంలో దాక్కున్నా పట్టుకుంటాం : రాజ్‌నాథ్