Virat Kohli:తన ఫాంపై ఒక్క మాటలో తేల్చేసిన కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్ లో ఎన్నడూ లేనివిధంగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు.

  • Written By:
  • Publish Date - July 16, 2022 / 06:03 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్ లో ఎన్నడూ లేనివిధంగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో మూడంకెల స్కోర్‌ చేసి మూడేళ్లు దాటిపోయింది. అంతకుముందు కెరీర్‌లో 70 శతకాలు బాదిన రన్‌ మెషీన్‌.. ఈ మధ్యకాలంలో ఒక్క శతకం కూడా చేయలేకపోయాడు. దీంతో అతనిపై విమర్శల దాడి మొదలైంది. వరుస వైఫల్యాలతో అతన్ని టీ ట్వంటీ జట్టు నుంచి సైతం తప్పించాలని కూడా కొందరు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్‌స్టా వేదికగా విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేశాడు. తన ఫామ్‌పై ఎవ్వరూ నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని పరోక్ష సందేశాన్ని పంపాడు.

ఒకవేళ నేను కింద పడితే ఏంటి? ఓ నా ప్రియతమా.. ఒకవేళ నువ్వు పైకి ఎగిరితే ఏంటి?అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోహ్లీ పోస్టు పెట్టాడు. ఈ క్యాప్షన్ ఉన్న ఇమేజ్‌ను కూడా షేర్ చేశాడు. తన మార్గాన్ని ఇంకా నమ్ముతూనే ఉన్నానని కోహ్లీ కోట్ రూపంలో చెప్పాడు. కింద పడినా.. పైకి లేచేందుకే అనే అర్థం వచ్చేలా తన పోస్టులో పేర్కొన్నాడు.ఈ కోట్‌ను కోహ్లి తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వెంకటేష్ ప్రసాద్ వంటి మాజీ ఆటగాళ్ళు కోహ్లీ ఫామ్ పై విమర్శలు గుప్పించారు. గత రికార్డుల కంటే ప్రస్తుతం ఎలా ఆడుతున్నాడో మాత్రమే చూడాలని వ్యాఖ్యానించారు. అయితే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. తన సహచర ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. అతడి ఫామ్‌పై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో బదులిస్తున్నాడు. కోహ్లీకి పాక్ కెప్టెన్ బాబర్ అజాం , ఇంగ్లాండ్ ప్లేయర్ బట్లర్ వంటి వాళ్లు మద్దతుగా నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం కోహ్లీకి అండగా నిలిచాడు. సచిన్, తాను సైతం ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నామనీ, కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వస్తాడని చెప్పాడు.