Kanpur Test: టీమిండియా, బంగ్లాదేశ్ జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భరత చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అశ్విన్, పంత్ ,గిల్, జడేజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అదే జోరును రెండో టెస్టులోనూ కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు ఇరు జట్ల మధ్య కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ (IND vs BAN 2nd Test) జరుగుతుంది. అయితే రెండో టెస్టుకు వాతావరణం అనుకూలించడం లేదు. ఈ మ్యాచ్ మొదటి 3 రోజుల్లో వర్షం పడే అవకాశం ఉంది.
కాన్పూర్ టెస్టు(Kanpur Test) అసంపూర్తిగా మిగిలిపోతే టీమిండియా లాభపడుతుందా లేదా నష్టపోతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన కాన్పూర్ టెస్టు మ్యాచ్ రద్దైతే.. ఈ సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌ను రద్దు చేయడం వల్ల భారత్‌కు భారీ నష్టం వాటిల్లవచ్చు. వాస్తవానికి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ప్రస్తుత ఎడిషన్‌లో భారత్‌కు ఇంకా 9 టెస్ట్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాటిలో 5 ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. సహజంగానే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ల ఫలితాలు ఎలాగైనా మారవచ్చు. అటు భారత్ న్యూజిలాండ్ జట్టుకు మూడు టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది WTC ఫైనల్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లన్నీ టీమిండియాకు చాలా కీలకం. కాబట్టి బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్లో లాభపడాలని రోహిత్ సేన భావిస్తుంది. 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఎడిషన్‌లో ప్రస్తుతం టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో 71.67 విజయాల శాతంతో నంబర్-1 స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 62.50 విజయాల శాతంతో రెండవ స్థానంలో ఉంది. కాన్పూర్ టెస్టు రద్దయితే అది భారత్ పై తీవ్రంగా ప్రభావం చూపించనుంది. ఎందుకంటే భారత్, ఆస్ట్రేలియాల మధ్య తేడా ఉండదు కాబట్టి రెండో టెస్టులో భారత్ ఎలాగైనా గెలవాల్సిన అవసరం ఉంది.
బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్‌లతో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ ఆఫ్రికన్ జట్టు గెలిస్తే.. భారత్-ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ రేసు చాలా ఆసక్తికరంగా మారనుంది. బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో గెలిస్తే టీమ్ ఇండియా వరుసగా మూడో ఫైనల్ ఆడేందుకు చాలా దగ్గరగా ఉంటుంది. రెండో టెస్ట్ మ్యాచ్ రద్దయితే ఈసారి భారత్ ఫైనల్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ బంగ్లాటెస్ట్ భారత్ కు అత్యంత కీలకంగా మారింది.
Also Read: CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్ కు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం