Super Over Rules: సూపర్ ఓవర్ రూల్స్ ఇవే..

సూపర్ ఓవర్ టై అయితే బౌండరీలు ఎక్కువగా చేసిన జట్టును విజేతగా నిర్ణయించేవారు. ఇరు జట్ల బౌండరీలు సమమైతే.. సూపర్ ఓవర్‌లో చివరి బంతికి ఎక్కువ పరుగులు చేసిన జట్టును విజేతగా ప్రకటించేవారు.

Published By: HashtagU Telugu Desk
Super Over Rules

Super Over Rules

Super Over Rules: బెంగుళూరు వేదికగా జరిగిన చివరి టి20 మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే హైలెట్ గా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ మ్యాచ్ ఫలితం డబుల్ సూపర్ ఓవర్ ద్వారా తేలడం ఇదే తొలి సారి. రోహిత్ సిక్సర్ల వర్షం, రెండో సూపర్ ఓవర్‌లో రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్‌తో టీమిండియా విజయం సాధించింది. దీంతో టీమిండియా మూడు సున్నతో సిరీస్ ను కైవసం చేసుకుంది.

గతంలో సూపర్ ఓవర్ టై అయితే బౌండరీలు ఎక్కువగా చేసిన జట్టును విజేతగా నిర్ణయించేవారు. ఇరు జట్ల బౌండరీలు సమమైతే.. సూపర్ ఓవర్‌లో చివరి బంతికి ఎక్కువ పరుగులు చేసిన జట్టును విజేతగా ప్రకటించేవారు. అంతేకాదు తొలి సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేసిన బౌలర్ రెండో సూపర్ ఓవర్‌లో బౌలింగ్ వేయకూడదు.ఈ క్రమంలోనే భారత్, అఫ్గాన్‌లు వేర్వేరు బౌలర్లతో బౌలింగ్ చేయించాయి. ఇదికాక చేజింగ్ టీమ్ తొలి సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేస్తుంది. ఒకవేళ తొలి సూపర్ ఓవర్ టై అయితే రెండో సూపర్ ఓవర్‌లోనూ చేజింగ్ జట్టే ముందుగా బ్యాటింగ్ చేస్తోంది.

తొలి సూపర్ ఓవర్‌లో ఔటైన బ్యాట్స్ మెన్ కు రెండో సూపర్ ఓవర్‌లో ఆడే అవకాశం మాత్రం ఉండదు. ఒకవేళ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగేతే సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ను కల్పించారు. అయితే ఇటీవల ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగినా బ్యాటింగ్‌కు అవకాశం కల్పించారు, నిజానికి ఇది సూపర్ ఓవర్ నిబంధనలకు విరుద్దం. నిబంధనల్లో భాగంగా సూపర్ ఓవర్ ప్రారంభమయ్యే ముందే ముగ్గురు బ్యాటర్ల వివరాలను అంపైర్లకు అందజేయాలి. సూపర్ ఓవర్లో ఆ బాటర్లు మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. సూపర్ ఓవర్లో ఇద్దరు బాటర్లు విఫలమై వికెట్లు కోల్పోతే దాన్ని ఆలౌట్ గా గుర్తిస్తారు. ఇక రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే మూడో సూపర్ ఓవర్ ని కూడా వేయిస్తారు. ఇలా ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్ని నిర్వహిస్తారు.

2020 ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ డబుల్ సూపర్ ఓవర్స్ ఆడాయి. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ట్రిపుల్ సూపర్ ఓవర్ చోటు చేసుకోలేదు.అసలు సూపర్ ఓవర్ని ప్రవేశపెట్టకముందు మ్యాచ్ టై అయితే బౌల్‌ ఔట్‌ పద్దతి ద్వారా విజేతను నిర్ణయించేవారు. ఈ పద్దతిలో ఒక్కో జట్టు నుంచి ఐదుగురు బౌలర్లు ఐదు బంతులతో వికెట్లను పడగొట్టాల్సి ఉంటుంది. 2007 టీ20 ప్రపంచకప్‍‌లో భారత్‌-పాక్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ టై అవడంతో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.

Also Read: Telangana Politics: పులి కాదు పిల్లి కాదు కేసీఆర్ ఎలుక: రఘునందన్ రావు

  Last Updated: 21 Jan 2024, 02:48 PM IST