Rain Effect : ఆగిపోయిన SRH – DC మ్యాచ్

Rain Effect : రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే భారీ వర్షం పడటంతో మ్యాచ్‌కు విఘాతం కలిగింది. మైదానాన్ని కవర్లతో కప్పేయగా, వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో మ్యాచ్ రద్దు చేస్తారా..? లేక కొనసాగిస్తారా..?

Published By: HashtagU Telugu Desk
Srh Dc Match Cancelled

Srh Dc Match Cancelled

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. 62 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టుకు అశుతోష్ శర్మ (41), ట్రిస్టన్ స్టబ్స్ (41) ప్రాణం పోశారు. ఇతరులు విఫలమవడంతో జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది.

బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ బలంగా కనిపించింది. కపిల్ కమిన్స్ మూడు కీలక వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశాడు. అక్షర్ పటేల్‌ను హర్షల్ పటేల్ ఔట్ చేయగా, కేఎల్ రాహుల్‌ను ఉనద్కత్ పెవిలియన్‌కు పంపాడు. రనౌట్ అయిన విప్రాజ్ నిగమ్‌తో కలిపి ఢిల్లీ టాపార్డర్ పూర్తిగా విఫలమయ్యింది. SRH బౌలర్లు ఒక అద్భుత ప్రదర్శన ఇచ్చారు.

అయితే, రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే భారీ వర్షం పడటంతో మ్యాచ్‌కు విఘాతం కలిగింది. మైదానాన్ని కవర్లతో కప్పేయగా, వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో మ్యాచ్ రద్దు చేస్తారా..? లేక కొనసాగిస్తారా..? అనేది చూడాలి. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగాలంటే అత్యవసరమైన విజయాన్ని కోల్పోతే సన్‌రైజర్స్ టోర్నీలో నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ప్రస్తుతం DC పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా, SRH తొమ్మిదవ స్థానంలో కేవలం మూడు విజయాలతో ఉంది.

  Last Updated: 05 May 2025, 11:05 PM IST