Site icon HashtagU Telugu

Mahendra Singh Dhoni: కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సంపాదన ఎంతో తెలుసా..?

MS Dhoni

MS Dhoni

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) రెండున్నరేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయినా.. సంపాదన మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ధోనీ కెప్టెన్సీలో భారత జట్టుకు 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచాడు. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. 41 ఏళ్ల వయసులో కూడా ధోనీ తన సత్తా చాటుతున్నాడు.

ఇప్పుడు ధోనీ తన రాష్ట్రం జార్ఖండ్‌లో కూడా అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తిగా నిలిచాడు. ధోనీ తొలిసారి ఈ స్థానాన్ని సాధించలేదు. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించినప్పటి నుండి మహేంద్ర సింగ్ ధోనీ స్థిరంగా జార్ఖండ్‌లో అతిపెద్ద ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా కొనసాగుతున్నాడు. మార్చి 31న ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో ధోనీ రూ.38 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాడు. 2021-22లో కూడా ధోనీ అదే మొత్తంలో ముందస్తు పన్ను చెల్లించాడు. నివేదికల ప్రకారం.. ఈ ఏడాది ధోనీ నికర విలువ దాదాపు రూ.1030 కోట్లుగా అంచనా. అతని నెలవారీ సంపాదన దాదాపు రూ.4 కోట్లుగా అంచనా వేయబడింది.

Also Read: WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 భారత జట్టు ఇదే

మహేంద్ర సింగ్ ధోనీ సంపాదనలో ఎక్కువ భాగం వివిధ కంపెనీలలో అతని పెట్టుబడుల ద్వారా వస్తుంది. హోమ్‌లేన్, కార్స్ 24, ఖాతాబుక్ సహా పలు కంపెనీల్లో ధోనీ పెట్టుబడులు పెట్టాడు. అతనికి రాంచీలో దాదాపు 43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ ఏడాది అడ్వాన్స్ ట్యాక్స్ ఆధారంగా గత 2 ఏళ్లలో అతని సంపాదన దాదాపు సమానంగా ఉందని అంచనా. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోనీ సంపాదనలో ఎలాంటి తగ్గుదల లేదు.

2020-21లో మహేంద్ర సింగ్ ధోనీ అడ్వాన్స్ ట్యాక్స్ కింద రూ.30 కోట్లు డిపాజిట్ చేశాడు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 38 కోట్ల ముందస్తు పన్నును బట్టి ధోని సంపాదన దాదాపు 1030 కోట్లు ఉంటుందని అంచనా వేయవచ్చు. 2019-20లో ధోనీ 2018-2019 అడ్వాన్స్ ట్యాక్స్‌కు సమానమైన 28 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్‌ను డిపాజిట్ చేశాడు. దీనికి ముందు 2017-18లో రూ.12.17 కోట్లు, 2016-17లో రూ.10.93 కోట్ల అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను ధోనీ డిపాజిట్ చేశాడు. ఐపీఎల్ లో ధోనీ కెప్టెన్సీలో CSK.. 2010, 2011, 2018, 2021లో నాలుగు సార్లు IPL టైటిల్‌ను గెలుచుకుంది. IPL చరిత్రలో టాప్-10 పరుగుల స్కోరర్‌లలో ధోనీ కూడా ఉన్నాడు.