Site icon HashtagU Telugu

Virat Kohli: నీ బ్యాటింగ్ సంగతేంటి? విమానంలో కోహ్లీకి ప్రశ్నించిన ప్రయాణికుడు

Viratt

Viratt

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గతంలో ఫ్యాన్స్ నుంచి తనకు ఎదురైన అనుభవాన్ని తాజాగా పంచుకున్నాడు. విమానంలో ఓ అభిమాని తన బ్యాటింగ్ గురించి ప్రశ్నించిన విషయాన్ని బయటపెట్టాడు. కోచి నుంచి కోహ్లీ ఢిల్లీలో విమానంలో వెళుతుండగా.. ఓ అభిమాని కోహ్లీని బ్యాటింగ్ గురించి ప్రశ్నించాడు. ఓ వ్యక్తి కార్పొరేట్ సంస్థలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్నాడని, విమానంలో నీ బ్యాటింగ్ సంగతేంటి అంటూ తనను ప్రశ్నించాడని కోహ్లీ తాజాగా చెప్పుకొచ్చాడు.

ఆసీస్ పర్యటనలో తాను అప్పట్లో బ్యాటింగ్ సరిగ్గా చేయలేదని, వెంటనే ఔట్ అయినట్లు కోహ్లీ చెప్పాడు. సరిగ్గా పరుగులు చేయలేదని, దానినే అతడు గుర్తు చేశాడని అన్నాడు. అయితే తాను కొన్ని మ్యాచ్‌లు సరిగ్గా ఆడలేదని ఒప్పుకున్నానని, దాంతో వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేయాలని అభిమాని చెప్పాడన్నాడు. దీంతో మీరు మీ కంపెనీలో మేనేజర్ స్థాయి నుంచి మూడు నెలల్లో ఛైర్మన్ కావాలని అతడికి చెప్పగా.. అతడు అదెలా సాధ్యమని ప్రశ్నించాడు. మరి తనను ఎలా ప్రశ్నించారని తాను అడిగినట్లు కోహ్లీ చెప్పాడు.

తాను వీడియో గేమ్‌లు ఆడటం లేదని, తాను అత్యుత్తమ ఆటను ఆడేందుకు ప్రయత్నిస్తానని కోహ్లీ అతనితో చెప్పారు. కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు సరిగ్గా ఆడలేమని, త్వరగా ఔట్ అవుతుంటామని కోహ్లీ స్పష్టం చేశాడు. ఈ మాటలు చెప్పేసరికి అతడు సైలెంట్ అయ్యాడని, కాసేపు నవ్వేసి సీట్‌లోకి వెళ్లిపోయాడని కోహ్లీ పేర్కొన్నాడు.

అయితే అంతకుముందు ఆ వ్యక్తి ధోనీ దగ్గరకు వెళ్లి కెప్టెన్సీ గురించి ఏవో సూచనలు చేసినట్లు కోహ్లీ తెలిపాడు. కానీ ధోనీ మాత్రం కూల్‌గా అతడి మాటలు విని సైలెంట్‌గా ఉన్నాడని, తర్వాత అభిమాని అతడి సీటు దగ్గరకు వెళుతూ మధ్యలో తాను కనిపిస్తే తన పక్కన వచ్చి కుర్చోని సలహాలు ఇచ్చినట్లు చెప్పాడు.

Exit mobile version