Duleep Trophy champions: వెస్ట్ జోన్ దే దులీప్ ట్రోఫీ!

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఈ ఏడాది వెస్ట్ జోన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సౌత్ జోన్ పై 294 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే కుప్పకూలింది.

Published By: HashtagU Telugu Desk
Champions

Champions

Duleep Trophy champions: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఈ ఏడాది వెస్ట్ జోన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సౌత్ జోన్ పై 294 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే కుప్పకూలింది. నాలుగోరోజే ఆరు వికెట్లు కోల్పోవడంతో ఓటమి ఖాయమైంది. మిగిలిన నాలుగు వికెట్లను కూడా మరో 80 పరుగులు జోడించి కోల్పోయింది. సౌత్‌జోన్‌ బ్యాటింగ్‌లో రోహన్‌ కన్నుమ్మల్‌ 93 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హైదరాబాద్‌కు చెందిన రవితేజ 53 పరుగులు చేసి ఔటయ్యాడు.

వెస్ట్‌జోన్‌ బౌలర్లలో షామ్స్‌ ములాని 4, జైదేవ్‌ ఉనాద్కట్‌, అతిత్‌ సేత్‌ తలా రెండు వికెట్లు తీశారు. డబుల్‌ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. ఉనాద్కట్‌ కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కింది. అంతకుముందు వెస్ట్‌జోన్‌ 4 వికెట్లకు 585 పరుగులవద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్‌ 30 ఫోర్లు, 4 సిక్సర్లతో 265 పరుగులు చేయగా… సర్ఫరాజ్‌ ఖాన్‌ 127 రన్స్ తో అజేయంగా నిలిచాడు. చివర్లో హెట్‌ పటేల్‌ దాటిగా ఆడి 51 పరుగులు చేశాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్‌ 327 పరుగులకు ఆలౌటవగా… వెస్ట్‌జోన్‌ 270 పరుగులకు ఆలౌటైంది.

  Last Updated: 25 Sep 2022, 06:31 PM IST