Site icon HashtagU Telugu

IND vs WI 2nd ODI: రెండో వన్డేలో రోహిత్, కోహ్లీ అవుట్

IND vs WI

New Web Story Copy (88)

IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మొదలైంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన భారత్ మూడు వన్డేల సిరీస్‌ను అద్భుతంగా ప్రారంభించింది. రెండో వన్డేలో వెస్టిండీస్ సత్తా చాటి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. కోహ్లి, రోహిత్‌లకు బదులుగా సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లకు జట్టులో చోటు కల్పించారు. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా నేడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథనాజే, షాయ్ హోప్ (wk/c), షిమ్రాన్ హెట్మెయర్, కేసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోతీ, అల్జారీ జోసెఫ్, జాడెన్ సీల్స్

భారత్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (WK), సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (c), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

Also Read: BRO Controversy : ‘బ్రో’ ను దెబ్బ తీసే కుట్ర మొదలైందా..?