టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ స్టేజ్‌లో భారత జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. టీమ్ ఇండియా ఆడిన మొత్తం 4 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

Published By: HashtagU Telugu Desk
Team India

Team India

West Indies: టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ స్టేజ్‌లో భారత జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. టీమ్ ఇండియా ఆడిన మొత్తం 4 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అయితే సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన తన మొదటి మ్యాచ్‌లోనే భారత్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనివల్ల సెమీఫైనల్‌కు చేరుకోవడానికి టీమ్ ఇండియా ఇతర జట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ 1లో ఫిబ్రవరి 26న సౌత్ ఆఫ్రికా- వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై భారత్ ఆశలు పెట్టుకుంది.

వెస్టిండీస్ గెలిస్తే టీమ్ ఇండియాకు టెన్షన్

సౌత్ ఆఫ్రికాపై వెస్టిండీస్ విజయం సాధిస్తే.. భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్ల వద్ద తలో 4 పాయింట్లు ఉంటాయి. అటువంటప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) ఉన్న రెండు జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. ఈ క్రమంలో సెమీఫైనల్ చేరాలంటే భారత్ తన మిగిలిన 2 మ్యాచ్‌లను భారీ రన్ రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. సౌత్ ఆఫ్రికాపై భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం వల్ల నెట్ రన్ రేట్‌లో చాలా వెనుకబడి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉండటమే కాకుండా -3.880 రన్ రేట్‌తో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Also Read: Safety Cess Collection : వాహనదారులకు షాక్..మార్చి 1 నుంచి భారీగా పెరగనున్న వాహనాల ధరలు

ఒకవేళ సౌత్ ఆఫ్రికా గనుక వెస్టిండీస్‌ను ఓడిస్తే భారత జట్టుకు సెమీఫైనల్ మార్గం సులభతరం అవుతుంది. ఆ తర్వాత వెస్టిండీస్, జింబాబ్వేలను ఓడించి సెమీఫైనల్ చేరే సువర్ణావకాశం భారత్‌కు ఉంటుంది. అందుకే సౌత్ ఆఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌పై భారత అభిమానులు కన్నేసి ఉంచారు.

సూపర్ 8 – గ్రూప్ 1 పాయింట్ల పట్టిక

  • వెస్టిండీస్
  • సౌత్ ఆఫ్రికా
  • భారత్
  • జింబాబ్వే
  Last Updated: 26 Feb 2026, 01:50 PM IST