West Indies vs India: నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి టీ20.. భారత్ జట్టు ఇదేనా..?

భారత్, వెస్టిండీస్ (West Indies vs India) మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గురువారం ఆగస్టు 3న జరగనుంది.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 08:22 AM IST

West Indies vs India: భారత్, వెస్టిండీస్ (West Indies vs India) మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గురువారం ఆగస్టు 3న జరగనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జరగనుంది. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసే అవకాశం ఉంది. తొలి టీ20లో భారత్‌ ప్లేయింగ్‌ XI ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్..?

IPL 2023లో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచిన యశస్వి జైస్వాల్ వెస్టిండీస్‌తో జరిగే T20 సిరీస్ ద్వారా తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్ ;లోకి అరంగేట్రం చేశాడు. అలాగే T20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ప్లేయింగ్ XIలో జైస్వాల్ చోటు దక్కించుకోవచ్చు. జైస్వాల్ కు అవకాశం ఇస్తే టీ20లో గిల్‌కు విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉంది టీమిండియా.

అంతే కాకుండా సంజు శాంసన్ ను ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్‌గా చూడొచ్చు. కీపింగ్ తో పాటు శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు రానున్నాడు. నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ అరంగేట్రం చేయవచ్చు. ఇటీవల IPL 2023లో తిలక్ ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు అద్భుత ప్రదర్శన చేశాడు.

కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆరో నంబర్‌లో బ్యాటింగ్ కు రావొచ్చు. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో పాండ్యా అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఏడో స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ఫినిషర్‌గా ప్లేయింగ్ ఎలెవెన్‌లో భాగం చేయవచ్చు.

Also Read: Divorce Rumours: మరోసారి తెరపైకి సానియా, షోయ‌బ్ మాలిక్ విడాకుల రూమర్స్.. అసలేం జరిగిందంటే..?

బౌలింగ్ విభాగం

ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బాధ్యతలు చూసుకోవచ్చు. వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ఉమ్రాన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చలేదు. ఇది కాకుండా పేసర్ ముఖేష్ కుమార్ టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేయవచ్చు. స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ కు జట్టులో స్థానం కల్పించనున్నారు.

తొలి టీ20కి ఇండియా జట్టు (అంచనా): శుభమన్ గిల్/యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.