IND vs WI ODI: రూటు మార్చిన వెస్టిండీస్.. ప్రమాదకర ఆటగాళ్లు జట్టులోకి

IND vs WI ODI: భారత్ వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పైచేయి సాధించింది. బ్యాటింగ్ లో, బౌలింగ్ లోనూ సత్తా చాటిన టీమిండియా వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ కు రెడీ అవుతుంది. ఈ నెల 27, 29, ఆగష్టు 1వ తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అయితే ఈ సారి కరేబియన్ సెలెక్టర్లు ఆచితూచి ఆటగాళ్లను సెలెక్ట్ చేశారు. కరేబియన్ ఆటగాళ్లలో విధ్వంసకరులకు కొదువ లేదు. ఈ మేరకు ఆ జట్టు ప్రమాదకర ఆటగాళ్లు షిమ్రాన్ హెట్మెయర్, స్టార్ ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్‌లకు జట్టులో స్థానం కల్పించారు. దీంతో ఆ జట్టు బలంగా మారింది. టెస్టులో ఏ మాత్రం ప్రభావం చూపని కరేబియన్లు వన్డే సిరీస్ లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ మేరకు షిమ్రాన్ హెట్మెయర్, స్టార్ ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్‌లను జట్టులోకి తీసుకున్నారు.

హెట్మేయర్ మిడిల్ ఆర్డర్ లో విధ్వంసం సృష్టించగలడు. ఫినిషింగ్ లో తాను క్రీజులో ఉంటే జట్టుకు విజయాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆడతాడు. గత ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్‌లో 300 పరుగులు చేశాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడి పలు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ను గెలిపించాడు.కైల్ మేయర్స్‌ మరో విధ్వంసకరుడు. గత ఐపీఎల్ లో అదరగొట్టాడు. ల‌క్నో జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్స్ గత ఐపీఎల్ లో 20 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేసిన రికార్డ్ ఉంది. చెలరేగి ఆడటం మేయర్లు స్పెషాలిటీ. కాగా వెస్టిండీస్ జట్టులోకి నికోలస్ పూరన్, ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ లను తీసుకోలేదు. నికోలస్ మేజర్ లీగ్ లో ఉండగా,హోల్డర్ విశ్రాంతిలో ఉన్నాడు.

Also Read: Telangana Ooty: తెలంగాణ ఊటీ రమ్మంటోంది.. కనువిందు చేస్తున్న అనంతగిరి అందాలు!