Site icon HashtagU Telugu

West Indies Team: నేపాల్‌లో విండీస్‌ క్రికెటర్లకు కష్టాలు.. ల‌గేజీ మోసుకున్న ప్లేయ‌ర్స్‌, వీడియో వైర‌ల్‌..!

West Indies Team

Safeimagekit Resized Img (1) 11zon

West Indies Team: వెస్టిండీస్ A జట్టు (West Indies Team) నేపాల్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్ కంటే ముందు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నిజానికి గురువారం ఖాట్మండు విమానాశ్రయానికి చేరుకున్న కరీబియన్ క్రికెటర్లకు విచిత్రంగా స్వాగతం పలికారు. వెస్టిండీస్ ఆటగాళ్ల లగేజీని తీసుకెళ్లేందుకు నేపాల్ ట్రక్కును ఏర్పాటు చేసిన పరిస్థితి నెల‌కొంది. అంతేకాకుండా వెస్టిండీస్ ఆట‌గాళ్లే తమ లగేజీని ఈ ట్రక్కులో ఎక్కించుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

Also Read: Bengaluru Win: స‌న్‌రైజ‌ర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్ట‌కేల‌కు రెండో విజ‌యం న‌మోదు చేసుకున్న బెంగ‌ళూరు

సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది

ల‌గేజీ విష‌యంలోనే కాదు.. ఆట‌గాళ్ల‌ను తీసుకెళ్లే బ‌స్సు ప‌రిస్థితి కూడా దారుణంగా ఉంది. వెస్టిండీస్ ఆటగాళ్లకు ఇచ్చిన బస్సు సాధారణ టూరిస్ట్ బస్సు. ఈ బస్సులో ఏసీ సౌకర్యం కూడా లేదు. ఈ ఏర్పాట్ల‌ తర్వాత వెస్టిండీస్ ఆటగాళ్లు చాలా ఆశ్చర్యపోయారు. కొంతమంది కరీబియన్ ఆటగాళ్ల ముఖాల్లో చిరునవ్వులు ఉన్నప్పటికీ చాలా మంది క్రికెటర్లు ఈ ఏర్పాటు తర్వాత ఆశ్చర్యంగా కనిపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ వీడియోపై త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఏప్రిల్ 27 నుంచి సిరీస్ ప్రారంభం

వెస్టిండీస్ A- నేపాల్ జట్టు మధ్య 5 T20 మ్యాచ్‌ల సిరీస్ జరగ‌నుంది. ఏప్రిల్ 27 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. IPL దృష్ట్యా కరేబియన్ దిగ్గజాలు నేపాల్ పర్యటనలో భాగం కాలేదు. అయితే ఐపీఎల్‌లో ఉన్న ఆట‌గాళ్లు త‌ప్ప మిగిలిన ఆట‌గాళ్లు అంతా నేపాల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ జ‌ట్టులో సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ కూడా ఉన్నారు. అయితే నేపాల్‌లో వెస్టిండీస్ క్రికెటర్లకు స్వాగతం పలికిన తీరు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే నేపాల్ ఆర్థిక ప‌రిస్థితి మంచిగా లేక‌పోవ‌టం వ‌ల‌నే ఇలాంటి సౌక‌ర్యాలు ఏర్పాటు చేశార‌ని ప‌లు జాతీయ వార్త సంస్థ‌లు పేర్కొన్నాయి.

We’re now on WhatsApp : Click to Join