జింబాబ్వేపై వెస్టిండీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. 154 పరుగుల లక్ష్యంT20 ప్రపంచకప్‌లో తో బరిలో దిగిన జింబాబ్వే 122 పరుగులకే 18.2 ఓవర్లలో ఆలౌటైంది. దీంతో 31 పరుగుల తేడాతో విండీస్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టులో ఓపెనర్ చార్లెస్ (45 పరుగులు), పావెల్ (28 పరుగులు), హోసెన్ (23 నాటౌట్) పరుగులు చేశారు. దింతో విండీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగలిగింది. జింబాబ్వే జట్టు బౌలింగ్ లో రాజా 4 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ముజార్బాని 2 వికెట్లు, సీన్ విలియమ్స్ ఒక వికెట్ తీశాడు.
అనంతరం 154 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే జట్టు బ్యాటింగ్ లో ఓపెనర్ వెస్లీ మాదేవేరి (27 పరుగులు), లుకే జోంగ్వే (29 పరుగులు) మాత్రమే చేశారు. మిగిలిన బ్యాట్సమెన్ ఎవరూ రాణించలేకపోయారు. దింతో జింబాబ్వే జట్టు 122 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ బౌలింగ్ లో జోసెఫ్ 4 వికెట్లు, హోల్డర్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.