Site icon HashtagU Telugu

WI vs Aus T20 World Cup: వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం

WI vs Aus T20 World Cup

Pooran And Powell

WI vs Aus T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ ఆస్ట్రేలియాను 35 పరుగుల తేడాతో ఓడించింది. క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. వెస్టిండీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేశారు. ఆడమ్ జంపా నాలుగు ఓవర్లలో 62 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా వెస్టిండీస్ నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో నికోలస్ పూరన్ 75 పరుగులతో అత్యధిక స్కోరు చేశాడు. కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (52), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (47 నాటౌట్), ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (40) కూడా అద్భుత ప్రదర్శన చేశారు.

ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. జోష్ ఇంగ్లిస్ ఒక్కడే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఇన్నింగ్స్ కష్టకాలంలో ఆసీస్ ను గట్టెకించే ప్ప్రయత్నం చేశాడు. ఇన్నింగ్స్ లో జోష్ ఇంగ్లీష్ 55 పరుగులు చేశాడు. స్పిన్నర్ గుడాకేష్ మోతీ (2/31), ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ (2/44) ఆతిథ్య జట్టుకు అత్యంత విజయవంతమైన బౌలర్లుగా నిలిచారు.

ప్రపంచకప్ కు ముందు వెస్టిండీస్‌కు ఇది శుభారంభం. గత కొన్నేళ్లుగా పేలవమయిన ప్రదర్శనతో నిరాశపరుస్తున్న విండీస్ జట్ట ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును ఓడించడం రాబోయే ప్రపంచ కప్ కోసం వారి బలమైన సన్నాహానికి నిదర్శనం. ఇక ఈ ఏడాది జూన్‌ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 6న ఒమన్‌తో ఆడనుండగా, వెస్టిండీస్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 2న పాపువా న్యూ గినియాతో ఆడనుంది.

వెస్టిండీస్: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, షాయ్ హోప్, ఆండ్రీ రస్సెల్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెక్‌కాయ్, అకేల్ హోసిన్, గుడాకేష్ మోతీ మరియు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్.

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (కీపర్), డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

Also Read: AP : ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీగా ఏబీవీకి పోస్టింగ్‌..సాయంత్రమే పదవీ విరమణ