Site icon HashtagU Telugu

Well Done Old Man: ఫీల్డింగ్ అదిరిపోయిందిరా ముసలోడా…బ్రావోను టీజ్ చేసిన ధోని..!!

Dhoni As Uncapped Player

Dhoni As Uncapped Player

IPL2022సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంజాయ్ చేస్తున్నాడు. గ్రౌండ్ లో చాలా సరదా ఉంటూ…తోటి ఆటగాళ్లపై కామెంట్స్ చేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం మ్యాచ్ జరిగింది.చెన్నై 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ సందర్భంగా ధోని చేసిన కామెంట్స్ స్టంప్ మైక్ లో రికార్డయ్యాయి. ఆ కామెంట్స్ ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రావోనే ఉద్దేశించి ధోని చేసిన ఆ వ్యాఖ్యలు చాలా సరదాగా ఉన్నాయి.

ధోని, బ్రావో..ఇద్దరు మంచి స్నేహితులు. మైదానంలో బ్రావోని సరదాగా ధోని ఎప్పుడూ టీజ్ చేస్తుంటాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీంలో కొన్నెళ్లుగా బ్రావో రెగ్యులర్ ప్లేయర్ గానే కాకుండా…ఇంటర్నెషనల్ క్రికెట్ లో తలపడే సమయాల్లోనే ఇలాగే సరదాగా ఉండేవారు. ఢిల్లీతో ఆదివారం రాత్రి మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో బ్యాటింగ్ కు బ్రావో…చివరి రెండ బాల్స్ కోసం పిలవకుండా బౌండరీలు కొట్టమని ధోనీని రిక్వెస్ట్ చేశాడు. కానీ ధోనీ బ్రావోని రెండు బంతుల్లో డబుల్ కోసం పరుగెత్తించాడు. లాస్ట్ బాల్ కు రనౌట్ నుంచి తప్పించుకునేందుకు డైవ్ చేసిన బ్రావో…ధోనివైపు కోపంతో చూసాడు. అతను మాత్రం నవ్వుతూ కనిపించాడు. ఆ తర్వాత చెన్నై ఫీల్డింగ్ సమయంలోనూ బ్రావోపై ధోని సెటైర్లు వేశాడు.

మ్యాచ్ లాస్ట్ లో ముకేష్ చౌదరి బౌలింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ఆన్రిచ్ నోర్జ్ బంతిని కవర్స్ దిశగా హిట్ చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బ్రావో డైవ్ చేసిన బంతిని అడ్డుకున్నాడు. దాంతో వికెట్ల వెనక నుంచి ధోని…వెల్ డన్ ఓల్డ్ మ్యాన్ అని అనడం స్టంఫ్ మైక్ లో రికార్డు అయ్యింది. ధోనీ చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.