కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది వెయిట్ లిఫ్టింగ్‌లో భారత అథ్టెల్ సంకేత్ మహాదేవ్ సర్గార్ రజతం సాధించాడు. 55 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్స్‌తో అతడు సిల్వర్ గెలిచాడు. ఫైనల్‌లో 139 కేజీల క్లీన్ అండ్ జెర్క్ దశలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. మలేసియన్ అథ్లెట్ బిన్ కసాడన్ మహ్మద్ అనీఖ్ 142 కేజీలను ఎత్తి స్వర్ణాన్ని నెగ్గాడు. 55 కేజీల పురుషల వెయిట్ లిఫ్టింగ్‌లో చివర్లో సంకేత్ తడబడ్డాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో 139 కేజీలను ఎత్తలేక సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు.
మొత్తంగా 248 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు. మలేసియన్ అథ్లెట్ ఫైనల్‌లో 142 కేజీల బరువును ఎత్తి మొత్తంగా 249 కేజీలతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్ వరకు 138 కేజీలను సమర్థవంతంగా ఎత్తిన సంకేత్.. చివర్లో తడబడ్డాడు.ఫైనల్‌లో బిన్ కసాడన్ పసిడిని గెలవాలంటే 4కేజీలను ఎత్తాల్సి ఉండగా.. అతడు 142 కేజీలను విజయవంతంగా లిఫ్ట్ చేశాడు. దీంతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫలితంగా భారత అథ్లెట్ రజతం తో సరిపెట్టుకున్నాడు.