Virat Kohli : కోహ్లీ ఫాంలోకి వస్తాడు : సంజయ్ బంగర్

ఐపీఎల్‌-2022లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా తప్పుకున్న కోహ్లి బ్యాట్స్‌మన్‌గా దుమ్మురేపుతాడనుకుంటే దారుణంగా నిరాశపరుస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - April 25, 2022 / 10:00 AM IST

ఐపీఎల్‌-2022లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా తప్పుకున్న కోహ్లి బ్యాట్స్‌మన్‌గా దుమ్మురేపుతాడనుకుంటే దారుణంగా నిరాశపరుస్తున్నాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కోహ్లి ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో​ 17 సగటుతో 119 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లోవిరాట్ కోహ్లి మరోసారి గోల్డ‌న్ డ‌క్‌గా పెవిలియన్ చేరాడు. ఓపెనర్ డుప్లెసిస్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి.. జానెస‌న్ వేసిన‌ బంతిని షాట్‌ ఆడే ప్ర‌య‌త్నం చేయగా బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో ఉన్న మాక్ర‌మ్ చేతుల్లో పడింది… దాంతో తొలి బంతికే డకౌటైన కోహ్లి ఒక్క సారిగా షాక్ తిని కాసేపు అలానే చూస్తుండిపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది….

ఇదిలాఉంటే.. ఈ ఐపీఎల్ లో ఫామ్ అందుకునేందుకు విరాట్ కోహ్లీ చాలా ప్రయతినిస్తున్నాడని ఆర్సీబీ జట్టు హెడ్ కోచ్ సంజయ్ బంగర్‌ వెల్లడించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్ గురించి సంజయ్ బంగర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘విరాట్ కోహ్లీ అత్య‌త్తుమ ఆట‌గాడు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్ర‌స్తుతం కోహ్లి ప‌రుగులు సాధించాడానికి చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఇలాంటి క్లిష్ట దశ ఉంటుంది. నిజానికి ఐపీఎల్ 15వ సీజన్‌ని విరాట్ కోహ్లీ చక్కగా ఆరంభించాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అనవసరపు రనౌట్లు కోహ్లీని మానసికంగా దెబ్బకొట్టాయి ఫామ్ అందుకునేందుకు అతడు చాలా ప్రయత్నిస్తున్నాడు అని సంజయ్ బంగర్ చెప్పుకొచ్చాడు…. ఇదిలాఉంటే.. 2019 నవంబర్‌లో చివరి సారిగా సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి అప్పటి నుంచి మరో సెంచరీ సాధించలేదు. ఈ విరామంలో 100 మ్యాచ్‌లు ఆడినప్పటికి శతకాన్ని మాత్రం చేరుకోలేకపోయాడు.