WCL 2025 : వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025) ఈరోజు బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానుంది. టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్స్ , పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆరంభమవుతుంది.
భారత్ తన యాత్రను జులై 20న పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతూ ప్రారంభించనుంది. ఈ హై వోల్టేజ్ ఇండో-పాక్ మ్యాచ్ కూడా రాత్రి 9 గంటలకు బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది. మాజీ స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ ఇండియా ఛాంపియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇండియా ఛాంపియన్స్ జట్టు
17 మంది సభ్యులతో కూడిన ఇండియా ఛాంపియన్స్ జట్టు ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకుంది. సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, వినయ్ కుమార్, అంబటి రాయుడు, నమన్ ఓజా, ఆర్పీ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ఈ జట్టులో ఉన్నారు.
2024లో జరిగిన తొలి ఎడిషన్‌లో ఇండియా ఛాంపియన్స్ పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్న విషయం గుర్తుంచుకోవాలి. ఈసారి కూడా భారత్ టైటిల్‌ను కాపాడగలదా అనేది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
డబ్ల్యూసీఎల్ 2025 వివరాలు
ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి – భారత్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా.
మ్యాచ్‌లు జులై 18 నుంచి ఆగస్ట్ 2 వరకు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నాలుగు వేదికలలో జరుగుతాయి.
లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. మొత్తం 15 లీగ్ మ్యాచ్‌లు ఉంటాయి.
లీగ్‌లో టాప్-4 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
ఫైనల్ ఆగస్ట్ 2న ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతుంది.
డబ్ల్యూసీఎల్ 2025 పూర్తి షెడ్యూల్
జులై 18: ఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs పాకిస్తాన్ ఛాంపియన్స్ – ఎడ్జ్‌బాస్టన్ – రాత్రి 9 గంటలకు
జులై 19: వెస్టిండీస్ ఛాంపియన్స్ vs దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ – ఎడ్జ్‌బాస్టన్ – సాయంత్రం 5 గంటలకు
జులై 19: ఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ – ఎడ్జ్‌బాస్టన్ – రాత్రి 9 గంటలకు
జులై 20: ఇండియా ఛాంపియన్స్ vs పాకిస్తాన్ ఛాంపియన్స్ – ఎడ్జ్‌బాస్టన్ – రాత్రి 9 గంటలకు
జులై 22: ఇండియా ఛాంపియన్స్ vs దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ – నార్తాంప్టన్ – సాయంత్రం 5 గంటలకు
జులై 22: ఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ – నార్తాంప్టన్ – రాత్రి 9 గంటలకు
జులై 23: ఆస్ట్రేలియా ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ – నార్తాంప్టన్ – రాత్రి 9 గంటలకు
జులై 24: ఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ – లీసెస్టర్‌షైర్ – రాత్రి 9 గంటలకు
జులై 25: పాకిస్తాన్ ఛాంపియన్స్ vs దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ – లీసెస్టర్‌షైర్ – రాత్రి 9 గంటలకు
జులై 26: ఇండియా ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ – హెడింగ్లీ – సాయంత్రం 5 గంటలకు
జులై 26: పాకిస్తాన్ ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ – హెడింగ్లీ – రాత్రి 9 గంటలకు
జులై 27: దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ – హెడింగ్లీ – సాయంత్రం 5 గంటలకు
జులై 27: ఇండియా ఛాంపియన్స్ vs ఇంగ్లాండ్ ఛాంపియన్స్ – హెడింగ్లీ – రాత్రి 9 గంటలకు
జులై 29: ఆస్ట్రేలియా ఛాంపియన్స్ vs పాకిస్తాన్ ఛాంపియన్స్ – లీసెస్టర్‌షైర్ – సాయంత్రం 5 గంటలకు
జులై 29: ఇండియా ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ – లీసెస్టర్‌షైర్ – రాత్రి 9 గంటలకు
జులై 31: సెమీఫైనల్ 1 vs సెమీఫైనల్ 4 – ఎడ్జ్‌బాస్టన్ – సాయంత్రం 5 గంటలకు
జులై 31: సెమీఫైనల్ 2 vs సెమీఫైనల్ 3 – ఎడ్జ్‌బాస్టన్ – రాత్రి 9 గంటలకు
ఆగస్ట్ 2: ఫైనల్ – ఎడ్జ్‌బాస్టన్ – రాత్రి 9 గంటలకు
Rishabh Pant: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. నాల్గవ టెస్ట్‌కు పంత్ దూరం?!