Site icon HashtagU Telugu

Watson Decodes Dhoni: వచ్చే ఏడాది ధోనీ రోల్ అదే : వాట్సన్

Shane And Dhoni

Shane And Dhoni

ఐపీఎల్ 2022 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానుల్ని దారుణంగా నిరాశపరిచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం… జడేజాకు పగ్గాలు అప్పగించిన తర్వాత సమర్థవంతంగా లీడ్ చేయలేకపోవడం కారణంగా చెప్పొచ్చు. అలాగే పలువురు కీలక ఆటగాళ్ళు ఫామ్ లో లేకపోవడం కూడా చెన్నై వరుస ఓటములకు కారణమైంది. సన్ రైజర్స్ తో మ్యాచ్ నుంచి మళ్ళీ కెప్టెన్ గా ధోనీ పగ్గాలు అందుకున్నా ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా లేనట్టే.

అయితే వచ్చే ఏడాది ఆటగాడిగా ధోనీ ఉంటాడో లేదో అన్న దానిపై చర్చ జరుగుతోంది. తనను రాబోయే సీజన్లలో కూడా కచ్చితంగా ఎల్లో జెర్సీలో చూస్తారంటూ ధోనీ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఆటగాడిగానా లేదా మరో రకంగానా అనేది తెలుసుకోవాలంటే మీరు వేచి చూడాల్సిందేనని చెప్పాడు. దీంతో ధోనీ కొత్త రోల్ పై అందరిలోనూ ఆసక్తి మొదలైంది.

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ స్పందించాడు. 2018 నుంచి 2020 పాటు ధోనీతో కలిసిచిన్ని జట్టు తరఫున ఆడిన షేన్ వాట్సన్.. రాబోయే సీజన్ లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరించే అవకాశముందని వెల్లడించాడు.. తన అభిప్రాయం ప్రకారం ధోనీ ఆటగాడి జెర్సీలో కాకుండా.. కోచ్ జెర్సీలో కన్పిస్తానని పరోక్షంగా అన్నట్లున్నాడని చెప్పాడు.. ధోనీ రిటైర్మెంట్ అయ్యాక.. చెన్నై సూపర్ కింగ్స్ తో కచ్చితంగా బంధాన్ని కొనసాగిస్తాడనీ, అతనితో చాలా సార్లు మాట్లాడినప్పుడు ఆ విషయం తనకు అర్థమైందని వెల్లడించాడు. తన అంచనా ప్రకారం ధోని చెన్నై జట్టుకు కోచ్ గానూ లేదా క్రికెట్ డైరెక్టర్‌గానూ వ్యవహరించే అవకాశముందనివాట్సన్ చెప్పుకొచ్చాడు. వాట్సన్ కామెంట్స్ తో ధోనీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ధోనీ కారణంగానే చెన్నై జట్టుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే తమ అభిమాన ఆటగాడు చెన్నై జట్టుతోనే సుదీర్ఘంగా కొనసాగాలని వారు బలంగా కోరుకుంటున్నారు.

Exit mobile version