Yashasvi Jaiswal Catch: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో అద్భుత క్యాచ్ నమోదైంది. వన్డే అరంగేట్ర ప్లేయర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal Catch) కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. గాల్లో పరుగెడుతున్న బంతిని అందుకుని అసహధారణ క్యాచ్ తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో ఈ అద్బుతం ఆవిష్క్రృతమైంది.
టీమిండియా అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా వేసిన షార్ట్ లెగ్ బంతిని ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకేట్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో టాప్ ఎడ్జ్ తీసుకుకొని షార్ట్ మిడ్ వికెట్ లో ఒక్కసారిగా గాల్లోకి లేచింది. దింతో మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యశస్వి జైస్వాల్ గాల్లో ఉన్న బంతిని వేటాడి పట్టుకున్నాడు. జైస్వాల్ క్యాచ్ పడతాడని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే బంతి గాల్లో జర్నీ చేస్తుంది. అయినప్పటికీ బంతిని ఏ మాత్రం మిస్ చేయలేదు. దీంతో బ్యాటర్‌తో పాటు.. మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. క్రికెట్ ప్రేమికులు జైస్వాల్ పట్టిన ఈ క్యాచ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Also Read: Viswak Sen : బాస్ ఈజ్ బాస్.. నాకు తెలిసింది మా ఇంటి కాంపౌండే..!
Excellent Run-out 👍
Sensational Catch 👌Some fielding magic from #TeamIndia! 🪄 🙌
Follow The Match ▶️ https://t.co/lWBc7oPRcd#INDvENG | @ShreyasIyer15 | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/lOp9r6URE4
— BCCI (@BCCI) February 6, 2025
మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగ్గా ఈ మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్ తో పాటుగా యువ పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేశారు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. మొదటి వన్డే ముంగిట కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ కుడి మోకాలుకు గాయం కావడంతో ఈ మ్యాచులో అడట్లేదని కోహ్లీ స్థానంలో యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకున్నామని పేర్కొన్నాడు…