నాగ్‌పూర్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనను టీవీ స్క్రీన్ లో చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. శనివారం నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించడానికి టీమిండియా (Teamindia) మరో అడుగు ముందుకేసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఇన్నింగ్స్, 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున రవీంద్ర జడేజా తన అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. వీరితో పాటు రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ కూడా చక్కటి ప్రదర్శన చేశారు.
https://twitter.com/FabulasGuy/status/1624315250748325888?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1624315250748325888%7Ctwgr%5Ed0e65a7adc1014c6dfe187803e4260f63b25fac5%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fsports%2Fcricket%2Frohit-sharma-agitated-while-cameraman-shows-him-continuously-on-screen-during-drs-call-video-viral-on-social-media-2332065
ఈ ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శనివారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు 17.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ నిష్క్రమించడంతో ఆసీస్ బ్యాటర్ హ్యాండ్స్‌కాంబ్ బ్యాటింగ్ కు వచ్చాడు. రాగానే అశ్విన్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 18వ ఓవర్లో రెండో బంతి హ్యాండ్స్‌కాంబ్ ప్యాడ్స్ కు తాకింది. అయితే అశ్విన్ తో పాటు టీమిండియా ఆటగాళ్లంతా అప్పీల్ చేసినా అంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో రోహిత్ రివ్యూ కోరాడు.
Also Read: Womens T20 World Cup 2023: నేడే టీమిండియా తొలి సమరం.. చిరకాల ప్రత్యర్థి పాక్ తో పోరు..!
ఆ సమయంలో కెమెరామెన్ రివ్యూకు సంబంధించిన పుటేజీని చూపకుండా కెమెరాను రోహిత్ తో పాటు టీమిండియా ఆటగాళ్ల మీదకు చూపాడు. అవే విజువల్స్ బిగ్ స్క్రీన్ పై కనిపించాయి. దీంతో చికాకు పడిన రోహిత్.. నన్నేం చూపిస్తావ్.. నా ముఖంలో ఏముంది. బిగ్ స్క్రీన్ ను చూపించు అన్నాడు. ఈ మాటలతో రోహిత్ వెనకాల ఉన్న సూర్యతో పాటు అశ్విన్, టీమిండియా ప్లేయర్స్ నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.