Site icon HashtagU Telugu

BCCI Drops ‘Ro-Ko’: నెట్స్‌లో చెమ‌టోడుస్తున్న స్టార్ ప్లేయ‌ర్స్‌.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ!

BCCI Drops 'Ro-Ko'

BCCI Drops 'Ro-Ko'

BCCI Drops ‘Ro-Ko’: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెడ్ బాల్ తర్వాత వైట్ బాల్‌లో పునరాగమనం చేస్తున్నాడు. కోహ్లీ వన్డే సిరీస్‌కు సన్నాహాలు కూడా ప్రారంభించాడు. బ్యాట్స్‌మెన్ ఇద్దరూ (BCCI Drops ‘Ro-Ko’) ఓపెన్ ఫీల్డ్‌లో త‌మ‌దైన షాట్‌లు కొట్టారు. విరాట్-రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.

విరాట్-రోహిత్ నెట్స్‌లో చెమ‌టోడుస్తున్నారు

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు రోహిత్ శర్మ ప్రాక్టీస్ సమయంలో పుల్ షాట్, రివర్స్ స్వీప్ వంటి షాట్లను కొట్టాడు. విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. కోహ్లి కూడా ప్రాక్టీస్‌లో హెలికాప్టర్ లాంటి షాట్ ఆడాడు. వీడియో కింద చూడ‌వ‌చ్చు.

రోహిత్ శర్మ భారత్ తరఫున 265 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతని బ్యాట్‌లో 49.16 సగటుతో 10866 పరుగులు వచ్చాయి. వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ రికార్డు చాలా అద్భుతంగా ఉంది. 295 వన్డేల్లో 13906 పరుగులు చేశాడు. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లిద్దరూ భారీ ఫీట్లు సాధించడానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. రోహిత్ 11 వేల పరుగులకు చేరువలో ఉండగా, విరాట్ కోహ్లీ 14 వేల పరుగులకు చేరువలో ఉన్నాడు.

Also Read: Jeet Adani Pledge: అదానీ కీల‌క నిర్ణ‌యం.. మంగ‌ళ సేవ కింద్ర వారికి రూ. 10 ల‌క్ష‌లు!

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు విరాట్-రోహిత్‌లకు పరీక్ష

గత కొంత‌కాలంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఫామ్‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లలో ఈ ఇద్దరు ఆటగాళ్ల అభిమానుల‌ను నిరాశ‌ప‌ర్చారు. ఈ కారణంగానే చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్ తో జరగనున్న వన్డే సిరీస్ రోహిత్, విరాట్ లకు పెద్ద పరీక్ష కానుంది. దిగ్గజాలు ఇద్దరూ త‌మ పాత ఫామ్‌ను అందుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.

ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరగనుంది. దీని తర్వాత రెండో మ్యాచ్ ఫిబ్రవరి 9న కటక్‌లో జరగనుంది. మూడో మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. టీ-20 సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేయడంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ను 4-1తో ఓడించింది.