Site icon HashtagU Telugu

Wasim Akram: పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ గెలవగలదా?.. మాజీ ఆటగాడు వసీం అక్రమ్ స్పందన ఇదే..!

Pakistan Cricket Board

Pakistan Cricket Board

Wasim Akram: ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ ఏడాది ప్రపంచకప్ 2023 భారత గడ్డపై నిర్వహించనున్నారు. అదే సమయంలో ఈ టోర్నమెంట్ మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరగనున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ అభిమానుల మధ్య చర్చనీయాంశంగానే ఉంటుంది. అయితే ప్రపంచకప్‌లో బాబర్ ఆజం జట్టు మెరుగ్గా రాణిస్తుందా? అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు పాకిస్థాన్ మాజీ వెటరన్ ఆటగాడు వసీం అక్రమ్ (Wasim Akram) సమాధానమిస్తూ.. ప్రపంచకప్‌పై పాకిస్థాన్ ఆశలపై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ స్పందించాడు.

పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ గెలవగలదా?

బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టుకు ప్రపంచకప్ గెలిచే సత్తా ఉందని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇది ఎక్కువగా పాక్ జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్, బాబర్ ఆజం వంటి ఆటగాళ్ల ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. మాకు మంచి టీమ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో పాక్ జట్టుకు ఇప్పటి అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన బాబర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పాక్ జట్టు తన వ్యూహానికి అనుగుణంగా, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌తో మెరుగ్గా ఆడితే పాక్ కి మంచి అవకాశాలు వస్తాయని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.

Also Read: Ahmedabad: వన్డే ప్రపంచకప్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లోని హోటల్ గదుల ధరలకు రెక్కలు..!

బాబర్ ఆజం కవర్ డ్రైవ్ అత్యుత్తమం: వసీం అక్రమ్

వసీం అక్రమ్ మాట్లాడుతూ.. భారతదేశం మైదానాలు, పరిస్థితులు మాకు అనుగుణంగా ఉంటాయి. మా ఆటగాళ్లు దీన్ని ఇష్టపడతారు. ఇది కాకుండా పాక్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై వసీం అక్రమ్ స్పందించాడు. అత్యుత్తమ ఆటగాళ్లలో బాబర్ ఒకడని, దేశం మొత్తం ఈ ఆటగాడిని అనుసరిస్తోందని ఆయన అన్నారు. టెస్టు అయినా, వన్డే అయినా, టీ20 అయినా.. ఏ ఫార్మాట్ అయినా ప్రజలను స్టేడియానికి తీసుకొచ్చాడు ఈ ఆటగాడు. నా అభిప్రాయం ప్రకారం బాబర్ ఆజం కవర్ డ్రైవ్ ఉత్తమమైనది అని అన్నారు. ప్రపంచ కప్ 2023 సీజన్‌లో పాకిస్తాన్ తన మొదటి మ్యాచ్‌ని అక్టోబర్ 6న హైదరాబాద్‌లో ఆడనుంది.