Nitish Kumar Reddy Century: మెల్ బోర్న్ టెస్టులో టీమిండియా అల్ రౌండర్లు అద్భుతంగా రాణించారు. టాపార్డర్, మిడిల్ ఆర్డర్ కుప్పకూలిన వేళ ఆల్ రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy Century), వాషింగ్టన్ సుందర్ లు చెలరేగిపోయారు. సుందర్ హాఫ్ సెంచరీతో రాణించాడు..నితీష్ సెంచరీతో కదం తొక్కాడు. అయితే ఆసీస్ గడ్డపై తొలి సెంచరీ సాధించిన నితీష్ ని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కానీ నితీష్ సెంచరీకి ప్రధాన కారణం వాషింగ్టన్ సుందర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
టీమిండియా 221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ ఫాలో-ఆన్ ప్రమాదంలో పడింది కానీ వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చి సహనం ప్రదర్శించి క్రీజులో పూర్తిగా నిలదొక్కుకున్నారు. సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సుందర్ ఇన్నింగ్స్‌లో కేవలం 1 ఫోర్ మాత్రమే ఉందంటే సుందర్ ఎంత కష్టపడి ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. నితీష్‌తో కలిసి 8వ వికెట్‌కు 127 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా వాషింగ్టన్ భారత్‌ను సేఫ్ జోన్లోకి తీసుకొచ్చాడు. సుందర్‌తో పాటు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఈ మ్యాచ్ చిరస్మరణీయం. నితీష్ తన కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. నితీష్ 171 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మూడో రోజు ఆట ఆగిపోయే వరకు నితీష్ 176 బంతుల్లో 105 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. అతనితో పాటు సిరాజ్ క్రీజులో ఉన్నాడు.
Also Read: New Zealand Vs Sri Lanka: లంక బౌలర్లను ఉతికారేసిన డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్
మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్కోరు 474 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ 221 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయింది. రోహిత్,కోహ్లీ లాంటి బ్యాటర్లు విఫలమైన వేళ నితీష్ మరియు సుందర్ 8వ వికెట్‌కు 127 పరుగులు జోడించి భారత్‌కు బలమైన పునరాగమనం చేశారు. వెలుతురు కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 9 వికెట్లకు 358 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా కంటే 116 పరుగులు వెనుకబడి ఉంది.