Site icon HashtagU Telugu

MS Dhoni: రాంచీలో జ‌రిగిన మ్యాచ్‌కు ధోని ఎందుకు రాలేక‌పోయాడు? కార‌ణ‌మిదేనా?!

MS Dhoni

MS Dhoni

MS Dhoni: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ రాంచీలో భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఎంఎస్ ధోనిని చూస్తారని ఆశించారు. అయితే ధోని (MS Dhoni) జేఎస్‌సీఏ క్రికెట్ స్టేడియంలో వన్డే మ్యాచ్ చూడటానికి రాలేకపోయారు. దీంతో అభిమానులు కాస్త నిరాశ‌కు గుర‌య్యారు. అయినప్పటికీ భారత్ రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌ను 17 పరుగుల తేడాతో గెలిచి, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ధోని మ్యాచ్‌కు రాకపోవడానికి గల కారణాన్ని భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (JSCA) కార్యదర్శి సౌరభ్ తివారీ ఓ ఛానెల్‌కు ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఎంఎస్ ధోని ఎందుకు రాలేదు?

సౌరభ్ తివారీ మాట్లాడుతూ.. “కొన్ని రోజుల క్రితం నాకు ధోని భయ్యాతో మాట్లాడటం జరిగింది. ఆ రోజు నేను రాంచీలో ఉండను. అందుకే మ్యాచ్ చూడటానికి రాలేను అని ఆయన నాకు ముందే చెప్పారు. తన బిజీ షెడ్యూల్ కారణంగా ధోని భారత్-సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూడటానికి రాలేకపోయారు.” అయితే అంతకుముందు ధోని రాంచీలో పలు సందర్భాల్లో మ్యాచ్‌లు చూడటానికి వచ్చారని ఆయ‌న గుర్తు చేశారు.

Also Read: Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ ఆడే విషయంపై స్పందన

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ప్రపంచ కప్ ఆడే విషయంపై కూడా ఆయ‌న‌ స్పందించారు. “ఆ ఇద్దరు ఆటగాళ్లు అంత దూరం ఆలోచించకుండా తమ రాబోయే మ్యాచ్‌లపై దృష్టి పెట్టాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతున్న క్రికెట్ తీరును చూస్తే వారిద్దరూ సులభంగా వన్డే ప్రపంచ కప్ 2027 ఆడగలరని నేను అనుకుంటున్నాను” అని సౌరభ్ అన్నారు.

సౌరభ్ తివారీ 2008 అండర్-19 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీతో కలిసి భారత జట్టుకు ఆడారు. ఆ తర్వాత ఇద్దరూ చాలా కాలం పాటు ఆర్సీబీలో కూడా భాగమయ్యారు. విరాట్ లాంటి గొప్ప ఆటగాడు జార్ఖండ్ గడ్డపై ఆడటం రాష్ట్రానికి గర్వకారణమని, విరాట్ అనేక రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని సౌరభ్ అభిప్రాయపడ్డారు.

Exit mobile version