Chahal Viral Video: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Chahal Viral Video), ధనశ్రీ వర్మ విడాకుల వార్త ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం వారిద్దరూ త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు వీరిద్దరూ స్పందించకపోవడం గమనార్హం. ఓ వైపు తన విడాకుల అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా, తాజాగా చాహల్ తప్పతాగి మీడియాకు చిక్కాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
आराम से चहल भाई , टीम को आपकी जरूरत है !! pic.twitter.com/1Vx6Q70mVo
— Byomkesh (@byomkesbakshy) April 29, 2023
ఎంతటి కోటీశ్వరులైనా సంసార జీవితం సరిగ్గా లేకపోతే మానసిక ప్రశాంతతను కోల్పోతారు. స్టార్ క్రికెటర్లు సైతం వ్యక్తిగత జీవితం సరిగ్గా లేక మనోవేదనకు గురైనవారే. దీనికి షమీ, హార్దిక్ ఉదాహరణగా చెప్పవచ్చు. షమీ, హర్డిక్ ఇప్పటికే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఆ క్లబ్ లోకి చాహల్ కూడా చేరబోతున్నాడు. విడాకుల అంశంపై చాహల్ మనోవేదనకు గురవుతున్నటుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే యుజ్వేంద్ర చాహల్ మద్యం మత్తులో తూగుతూ కనిపించాడు. సోయి లేకుండా తాగిన చాహల్ ఓ వ్యక్తి సాయంతో పబ్ నుంచి బయటకు వస్తూ మీడియాకు చిక్కాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతకుముందు ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్ నుండి అన్‌ఫాలో చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లో ధనశ్రీతో ఉన్న చిత్రాలను చాహల్ తొలగించాడు.
Also Read: Rashid Khan: రషీద్ ఊచకోత.. ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు!
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ డిసెంబర్ 2020 లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చాలా హ్యాపీ జంటగా కనిపించారు, కానీ ఇప్పుడు ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. త్వరలోనే వీరి విడాకుల వార్త అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.