Site icon HashtagU Telugu

Sports Minister Of Pakistan: పాక్ సీనియర్ క్రికెటర్‌కు మంత్రి పదవి

Wahab Riaz

Resizeimagesize (1280 X 720) (1) 11zon

దేశంలోని పెరుగుతున్న సంక్షోభ పరిస్థితి నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ చర్యలు చేపట్టింది. మంత్రిత్వ శాఖల్లో పలు మార్పులు తీసుకొస్తోంది. వీటిలో భాగంగా సీనియర్ క్రికెటర్ వహాబ్ రియాజ్‌ (Wahab Riaz)ను క్రీడాశాఖ మంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు రాజకీయ నిపుణులు తప్పుబడుతున్నారు.

పాకిస్థాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ తాత్కాలిక క్రీడా మంత్రిగా నియమితులయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు చాలా కాలంగా దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్, క్రీడలలో చురుకుగా ఉంటూనే రాజకీయాల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం (జనవరి 27) ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌కు తాత్కాలిక క్రీడా మంత్రిగా నియమితుడయ్యాడు. వహాబ్ రియాజ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. స్వదేశానికి తిరిగి రాగానే మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

Also Read: U19 Women T20 World Cup 2023: రేపు ఇంగ్లాండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. కప్ కొట్టేదెవరో..?

వహాబ్ రియాజ్ చివరిసారిగా 2020లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అతను 27 టెస్టులు, 92 వన్డేలు, 36 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో 103 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ శుక్రవారం (జనవరి 27) వాహబ్ నియామకాన్ని ధృవీకరించారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే వరకు వాహబ్ రియాజ్ ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. శుక్రవారం (జనవరి 27) ఓ ఇంటర్వ్యూలో మాజీ చీఫ్ సెలక్టర్ ముహమ్మద్ వసీమ్, మాజీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాపై వాహబ్ ఆరోపణలు చేశారు. నాతో పాటు షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్ లాంటి సీనియర్ ఆటగాళ్లతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిష్పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని అన్నాడు.