Site icon HashtagU Telugu

Rishabh Pant: పంత్ కు మద్ధతుగా నిలిచిన లక్ష్మణ్

Rishabh Pant

Rishabh Pant

భారత క్రికెట్ జట్టులో గత కొంత కాలంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు వచ్చిన అవకాశాలు మరొకరికి రాలేదంటే అతిశయోక్తి కాదు. అయితే పంత్ పరిమిత ఓవర్ల ఫార్మేట్ లలో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. టీ ట్వంటీ ప్రపంచకప్.. ఆ తర్వాత కివీస్ తో టీ ట్వంటీ, వన్డే సిరీస్ లలో వైఫల్యాల బాట వీడలేదు. దీంతో పంత్ కోసం సంజూ శాంసన్ కు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పంత్ విఫలమవుతున్నా ఎందుకు పదేపదే ఆడిస్తున్నారని తాజాగా స్టాండిన్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కు ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన లక్ష్మణ్ పంత్ కు మద్ధతుగా నిలిచాడు.

వాళ్లకు అవకాశాలు ఇవ్వడం, వాళ్లను ఎంపిక చేయకపోయినప్పుడు అదే విషయాన్ని చెప్పడం చేస్తున్నామన్నాడు. పంత్‌ నాలుగో స్థానంలో బాగా ఆడుతున్నాడనీ, అతడు ఓల్డ్‌ ట్రాఫర్డ్‌లో సెంచరీ చేసి ఎక్కువ కాలం కూడా కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. టీ ట్వంటీ క్రికెట్ లో సత్తా చాటడం ద్వారా ఆటగాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నాడు. కాగా పంత్ ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో సెంచరీ సాధించాడు.

అయితే టీ ట్వంటీలు, వన్డేల్లో అతను నిలకడగా రాణించడం లేదు. అయినప్పటకీ టీమ్ మేనేజ్ మెంట్ అతనికి సపోర్ట్ గా నిలుస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ద్రవిడ్‌ లేకపోవడంతో తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించిన లక్ష్మణ్‌ తన రోల్‌ను పూర్తిగా ఎంజాయ్‌ చేసినట్లు చెప్పాడు. వర్షం అసంతృప్తి కలగజేసినప్పటకీ..కోచింగ్‌ మాత్రం పూర్తి సంతృప్తినిచ్చిందన్నాడు. మధ్యమధ్యలో ఇలా కోచింగ్‌ బాధ్యతలు చేపట్టడం, యువకులతో గడపడం బాగుందన్నాడు.